Hyderabadలో నీట మునిగిన వందల కొద్ది లగ్జరీ విల్లాలు.. రోడ్డు మీదకు కోటీశ్వరులు

Heavy Flood Water-Hyd Villas: గత మూడ్రోలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు జలమయం అయ్యాయి. ఇక కోట్లు పెట్టి నిర్మించిన విల్లాల్లోకి వరద నీరు చేరడం గమనార్హం. ఆ వివరాలు..

Heavy Flood Water-Hyd Villas: గత మూడ్రోలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు జలమయం అయ్యాయి. ఇక కోట్లు పెట్టి నిర్మించిన విల్లాల్లోకి వరద నీరు చేరడం గమనార్హం. ఆ వివరాలు..

గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భారీ వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్ల మీదకు భారీ ఎత్తున వరద నీరు చేరి.. రవాణా వ్యవస్థ దెబ్బ తిని జన జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వేల ఇండ్లు నీట మునిగిపోవటంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇటు విజయవాడ.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో భయంకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇక హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు చుట్టుముట్టాయి. ఈ దెబ్బకు సామాన్య, మధ్య తరగతి ప్రజలే కాదు కోటీశ్వర్లు కూడా వరద బాధితులుగా మారి రోడ్డున పడ్డారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారు సైతం.. ఈ వర్షం దెబ్బకు ఆకలితో అలమటిస్తున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈే దెబ్బతో ప్రకృతి ప్రకోపానికి పేద, ధనిక తేడా లేదనటానికి ఈ భారీ వర్షాలే ఉదాహరణ అని పలువురు పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.

Show comments