హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. సీఎస్‌ కీలక సమావేశం!

CS Shanti Kumari: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ‘హడ్రా’ కొరడా ఝులిపిస్తుంది. కొంతకాలంగా చెరువులు, నాళాలు, కొన్నిప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు.అలాంటి అక్రమ కట్టడాలను కూల్చి వేసే పనిలో ఉంది హైడ్రా.

CS Shanti Kumari: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ‘హడ్రా’ కొరడా ఝులిపిస్తుంది. కొంతకాలంగా చెరువులు, నాళాలు, కొన్నిప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు.అలాంటి అక్రమ కట్టడాలను కూల్చి వేసే పనిలో ఉంది హైడ్రా.

గత పదిరోజులగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు మారుమోగుతుంది. హైదరాబాద్ లో అక్రమంగా నిర్మాణలు చేపట్టిన వారిపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపుతుంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తున్నారు. మాదాపూర్ లో హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయడం పై పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి హైదరాబాద్ లో వరదలకు శాశ్వత పరిష్కారం చేపట్టడానికి ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అంటున్నారు. తాజాగా హైడ్రా కూల్చి వేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. వివరాల్లోకి వెళితే..

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంత కుమారి అధికారులతో పలు కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.  హైదరాబాద్‌లో అక్రమాల కూల్చివేత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం..  కూల్చి వేత సమయంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ ఏర్పాటు చేసి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ‘హైడ్రా’ కమీషనర్ గా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ కొనసాగుతున్నారు. ఎప్పుడైతే ‘హైడ్రా’ రంగంలోకి దిగి కూల్చివేతల కార్యక్రమం చేపట్టిందో అప్పటి నుంచి కొంతమంది బడాబాబులకు హైడ్రా పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే అక్రమ కట్టడాలు ఎవరు నిర్మించినా చివరికి.. సొంత కుటుంబ సభ్యులు ఉన్నా.. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Show comments