Arjun Suravaram
Musi River Victims Series On Owaisi: గురువారం రెవెన్యు అధికారులు మూసీ పరివాహక ప్రాంతమైన చాదర్ ఘట్ పరిధిలో ఇళ్లపై సర్వే చేశారు. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమను పరామర్శించేందుకు ఎంఐఎం నేతలు ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Musi River Victims Series On Owaisi: గురువారం రెవెన్యు అధికారులు మూసీ పరివాహక ప్రాంతమైన చాదర్ ఘట్ పరిధిలో ఇళ్లపై సర్వే చేశారు. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమను పరామర్శించేందుకు ఎంఐఎం నేతలు ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Arjun Suravaram
హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఏ పొద్దు ఏ బుల్డోజర్ వచ్చి.. ఇంటిని నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు.. తాజాగా నగరవాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహన ప్రాంతంలోని ఇళ్లపై అధికారులు ‘RB-X’ రాశారు. ఒక సర్వే పేరుతో.. చాలా ఇళ్లపై ఈ అక్షరాలు రాశారు. ముందుగా సర్వే చేపట్టి.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా RB-X అని రాస్తున్నారని.. ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లు వచ్చి.. తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై , ఎంఐంఎం అధినేత అక్బరుద్దిన్ ఓవైసీపై బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గురువారం రెవెన్యు అధికారులు మూసీ పరివాహక ప్రాంతమైన చాదర్ ఘట్ పరిధిలో ఇళ్లపై సర్వే చేశారు. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అని, తమ పిల్లలకు పాఠశాలలు ఇబ్బంది అవుతుందని బాధితులు వాపోతున్నారు. అధికారులు ఆధార్ కార్డు, కరెంట్ బిల్, వాటర్ బిల్, రేషన్ కార్డు వంటి వివిధ పత్రాలను అడిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఒక నెల క్రితం కూడా వచ్చివెళ్లారని, ఆ సమయంలో కూడా ఇదే కార్డులు చూపించామని అంటున్నారు.
ఓ మహిళ బాధితురాలు మాట్లాడుతూ..తమ ఆవేదనను వ్యక్తం చేసింది. తాము పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని తెలిపింది. ఇప్పుడు అధికారులు సడెన్ గా వచ్చి..మార్కింగ్ వేస్తున్నారని తెలిపింది. ముందుకు తమకు ఇళ్లు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి కదా అంటూ బాధితురాలు ప్రశ్నించారు. ఇళ్లు ఇస్తామని చెప్పారు కానీ.. ఎక్కడ ఇస్తారు..ఎప్పుడు ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నామని, వారందరికి ఒకటే ఇల్లు అంటే ఎలా కుదురుతుందని బాధితురాలు తెలిపారు. అలానే ఇప్పుడు ఉన్న ప్రాంతం తాము పని చేసే ప్రాంతాలకు దగ్గర ఉందని, ఇప్పుడు సడెన్ గా ఎక్కడో ఇస్తామంటే.. ఇబ్బంది పడతామని తెలిపారు. తాము ఇంత ఆవేదన చెందుతున్నా.. ఇక్కడికి ఎంఐఎం నేతలు ఎవరూ, కనీసం తమ ఎమ్మెల్యే బలాల కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు కష్టాల్లో ఉంటే ఆదుకుంటామనే ఓవైసీ..ఇప్పుడు ఎక్కడ దాకున్నావ్ అంటూ ఆయనపై ఓ బాధితురాలు ఫైర్ అయ్యారు. ధనవంతుల ఇళ్లను కూల్చడం కరెక్ట్ కావచ్చేమో..కానీ పేదల ఇళ్లను ఇలా నేలమట్టం చేయడానికి రావడం మంచిది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నదిని పరి రక్షించాలంటే మరెన్నో మార్గాలు ఉన్నాయని తమలాంటి పేదవారి ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వంపై, ఎంఐఎం నేతలపై మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.