Charminar: ఇకపై నైట్‌ చార్మినార్‌ అందాలు చూడటం కుదరదు.. అసలు కారణం ఇదే

చార్మినార్‌ సందర్శనకు వెళ్లే వారికి అలర్ట్‌. ఇకపై రాత్రిపూట చార్మినార్‌ను అందాలను చూడలేం. కారణం ఏంటంటే..

చార్మినార్‌ సందర్శనకు వెళ్లే వారికి అలర్ట్‌. ఇకపై రాత్రిపూట చార్మినార్‌ను అందాలను చూడలేం. కారణం ఏంటంటే..

హైదరాబాద్‌ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ, చార్మినార్‌. భాగ్యనగరంలోనే కాక దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరబాద్‌కే తలమానికంగా నిలిచింది చార్మినార్‌. దీన్ని చూడటం కోసం మన రాష్ట్రం నుంచే కాక.. ఇతర ప్రాంతాల ప్రజలు, విదేశీయులు సైతం భారీ ఎత్తున తరలి వస్తుంటారు. ఇక చార్మినార్‌ ప్రాంతం షాపింగ్‌కు మరీ ముఖ్యంగా గాజులకు ప్రసిద్ధి చెందింది. చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో దొరికే ముత్యాలు, గాజులు మన దేశంలో ఎక్కడా దొరకవు అన్న స్థాయిలో గుర్తింపు పొందింది. రంజాన్‌ మాసంలో చార్మినార్‌ ప్రాంతంలో ఉండే రద్దీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం ముస్లింలే కాకుండా.. అందరూ ఇక్కడ షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఇక పగటి పూట కంటే రాత్రి పూట చార్మినార్‌ మరింత అందంగా ఉంటుంది. లైట్ల వెలుగులో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే చాలా మంది పగటి పూట కంటే రాత్రి వేళలో చార్మినార్‌ సౌందర్యాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉంటారు. పగలంతా ఆఫీసులు, కాలేజీలు అంటూ బిజీగా ఉండే ఉద్యోగులు, యువత.. రాత్రి పూట చార్మినార్‌ను చూసేందుకు వస్తుంటారు. అయితే ఇకపై ఈ అవకాశం ఉండదు అంటున్నారు. రాత్రిపూట చార్మినార్‌ వద్దకు వెళ్లలేని పరిస్థితులు వచ్చాయి. అసలేం జరిగిందంటే..

చాలామందికి పగటి పూట కన్నా రాత్రి వేళ చార్మినార్‌ చూడాలని భావిస్తారు. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వారాంతాల్లో రాత్రి పూట చార్మినార్‌ వద్దకు వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే రాత్రి 11 గంటల తర్వాత చార్మినార్‌ వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు మూసి వేస్తున్నారు. వాహనదారులు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. వెహికల్స్‌ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి పోలీసు సిబ్బందిని పెట్టి కాపలా కాస్తున్నారు. కాసేపు చూసి వస్తాము.. వెళ్లనివ్వమని కోరినా అనుమతించడం లేదు. ఉద్యోగాల వల్ల పగలు బిజీగా ఉండే తాము రాత్రి పూట చార్మినార్‌ చూడ్డానికి వస్తే.. ఇలా అడ్డుకోవడం భావ్యం కాదంటున్నారు.

ఇక గత కొన్ని రోజులుగా రాత్రిపూట చార్మినార్‌ పరిసర ప్రాంతాలు చీకటిగా మారుతున్నాయి. 11 గంటల దాటితే.. చార్మినార్‌ను దగ్గర నుంచి చూసే పరిస్థితి కూడా ఉండటం లేదు. దూరంగా నల్లగా కనిపిస్తోన్న​ ఆకారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో రాత్రి పూట చార్మినార్‌ సందర్శన కోసం వచ్చే వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక పగలు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. కనీసం ఫొటోలు కూడా సరిగా దిగడానికి అవకాశం ఉండదు. అందుకే రాత్రి పూట చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోతుంది.

Show comments