Big అలర్ట్.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారా? రేపే లాస్ట్ ఛాన్స్..

ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి చలాన్ల విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి చలాన్ల విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదు. చాలా కొద్దిమంది మాత్రమే ట్రాఫిక్ నియమనిబంధనలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధికారులు ఎన్నో రకాలుగా చెక్ పెడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పపడేవారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. చాలా మంది చెలాన్లు సకాలంలో చెల్లించకుండా పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఎప్పుడో ట్రాఫిక్ పోలీసుల కంట పడితే.. వారు పెండింగ్ చలాన్లు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ సర్కార్  పెండింగ్ చలాన్లకు డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రేపు (జనవరి 10) తో ముగిసిపోతుంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు వాహనదారులకు మరోసారి అలర్ట్ చేశారు. ఇప్పటి వరకు క్లీయర్ చేయని వారు త్వరపడాలని సూచించింది.

పెండిగ్ చలానా ద్విచక్ర వాహనంపై 80 శాతం, భారీ వాహనాలకు 60 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన తర్వాత రాయితీ అందుబాటులో ఉండదని, చలాన్లు వందశాతం చెల్లించాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వసూళ్లు అయినట్లు సమాచారం. పెండింగ్ చలాన్లు చెల్లించేవారు మీ సేవ, ఈ సేవ కేంద్రాలతో పాటు ఆన్ లైన్ లో చెల్లించే అవకాశం ఉంది. ఏదైనా సందేహం ఉంటే.. 040-27852721, 8712661690 వాట్సాప్ నెంబర్లలో అధికారులను సంప్రదించవొచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ తో రెండు లక్షల వాహనాలకు ప్రయోజనం చేకూరనుంది. చలాన్లు పెండింగ్ ఉన్నవారు క్లీయర్ చేయకుండా గడువు ముగిసిన తర్వాత ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే బండి సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈసారి పెండింగ్ చలాన్ల వసూలు కోసం పోలీస్ యంత్రాంగాం వినూత్న ప్రచారం చేపట్టి.. వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెండింగ్ చెలాన్లు రాబట్టేందుకు కొత్త పద్దతులను అవలంభిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పెండింగ్ చలాన్లు చెల్లించాంటూ డిస్కౌంట్ ఆఫర్ కి సంబంధించిన వివరాలు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అంతేకాదు కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు మైక్ ల ద్వారా, రికార్డు ద్వారా ప్రచారం చేస్తున్నాను. హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్ లేకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, భారీ వాహనాల్లో బెల్ట్ పెట్టుకోకుండా నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం ఇలా పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి పెండింగ్ చలాన్లకు డిస్కౌంట్ లభించించడంతో వాహనదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments