Holidays For Schools, Colleges In July 2024: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే!

Holidays: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ప్రతి నెల విద్యార్థులకు కచ్చితంగా ఉండే సెలవులతో పాటుగా అదనంగా మరికొన్ని హాలీడేస్‌ వస్తుంటాయి. జూలైలో విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ప్రతి నెల విద్యార్థులకు కచ్చితంగా ఉండే సెలవులతో పాటుగా అదనంగా మరికొన్ని హాలీడేస్‌ వస్తుంటాయి. జూలైలో విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ ఏడాది ఎండాకాలంలో భానుడి ప్రతాపం చూసి.. సమ్మర్‌ హాలీడేస్‌ను పెంచుతారని అందరూ భావించారు. అయితే జూన్‌ నెల ప్రారంభం నుంచే వర్షాలు కురవడంతో.. వాతావరణం చల్లబడింది. దాంతో వేసవి సెలవులు యథాప్రకారమే ముగిశాయి. జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దీని కన్నా ముందే ఇంటర్‌ కాలేజీలు మొదలయ్యాయి. ఇక గత నెల అనగా జూన్‌ నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలు స్టార్ట్‌ అయ్యాయి. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే జూలై నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు వస్తున్నాయి. మరి ఏ ఏ రోజుల్లో సెలవులు రానున్నాయి.. ఆ జాబితా మీకోసం ఇక్కడ..

జూలై నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముందుగా జూలై 7 ఆదివారం సెలవు. ఆ తర్వాత 13, 14 రెండో శనివారం, ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు స్కూళ్లకు సెలవు. జూలై 21, 28 ఆదివారాలు రావడంతో ఈ రెండు రోజులు కూడా విద్యార్థులకు హాలీడేనే. ఇక జూలై 27న..  తెలంగాణ ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. కారణం బోనాల పండుగ. అంతేకాక జూలై 17 బుధవారం మొహర్రం కాబట్టి కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు.

అలానే కొన్ని ప్రాంతాల్లో జూలై 18 గురువారం కూడా మొహర్రం జరుపుకునే అవకాశం ఉంది కనుక దీంతో కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఇలా మొత్తంగా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కలుపుకుని.. 6 రోజులు సెలవులు రాగా.. మొహర్రం, బోనాల సందర్భంగా మరో రెండు సెలవులు వస్తున్నాయి. దాంతో జూలై నెలలో విద్యార్థులకు మొత్తంగా 7 రోజులు హాలీడేస్‌ రానున్నాయి. ఆ లిస్ట్‌ ఇక్కడ మీకోసం..

జూలై నెలలో సెలవులు..

  • జూలై 7 – ఆదివారం
  • జూలై 13 – రెండో శనివారం
  • జూలై 14 – ఆదివారం
  • జూలై 17, 18 – మొహర్రం, కొన్ని ప్రాంతాల్లో 18న సెలవు ఇవ్వనున్నారు.
  • జూలై 21 – ఆదివారం
  • జూలై 27 – బోనాలు
  • జూలై 28 – ఆదివారం

ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మొహర్రానికి మూడు రోజులు సెలవులు ఇస్తుంటారు. అంతేకాకుండా జూలై 7 పూరి జగన్నాథ్ రథయాత్ర. దాంతో చాలా ప్రాంతాల్లో ఈ రోజు కూడా సెలవు ఉండొచ్చు. మొత్తానికి జూలై నెలలో కొన్ని స్కూల్స్‌కు ఏడు నుంచి 8 రోజుల వరకు రానుండగా.. మరికొన్నింటికి పెరిగే అవకాశం ఉంది. సెలవులపై పాఠశాల యాజమాన్యం అధికారిక ప్రకటన వెలువరిస్తుంది.

Show comments