ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక రేషన్‌కార్డులతో పని లేకుండానే పథకాలు!

New Cards Instead Of Ration Cards: త్వరలోనే రేషన్‌ కార్డులతో పని లేకుండానే సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు.. ఆ వివరాలు..

New Cards Instead Of Ration Cards: త్వరలోనే రేషన్‌ కార్డులతో పని లేకుండానే సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు.. ఆ వివరాలు..

రేషన్‌కార్డు.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. మరి అవి అందాలంటే.. రేషన్‌ కార్డు తప్పనిసరి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్‌ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే.. పథకాలు పొందలేము. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్‌ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు పొందాలంటే రేషన్‌ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.

ఇక తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా వచ్చి పదేళ్లయ్యింది. కానీ ఇప్పటి వరకు కొత్త రాష్ట్రంలో రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదు. చాలా మంది రేషన్‌ కార్డు లేని కారణంగా.. అర్హత ఉన్నా సరే.. ప్రభుత్వ పథకాలు పొందలేని పరిస్థితి. ఇక తాజాగా రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తాము అధికారంలోకి రాగానే.. అర్హులందరికి రేషన్‌ కార్డ్స్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే.. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా.. కొత్త రేషన్‌ కార్డు కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 15 తర్వాత.. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయనుంది అని సమాచారం. ఆ వివరాలు..

ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే.. రేషన్ కార్డులతో పని లేకుండా అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించడానికి ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం దీనిపై కార్యచరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ హెల్త్‌ కార్డులు జారీ చేసి.. అర్హులైన ప్రతి ఒక్కరికి.. రేషన్‌ కార్డుతో పని లేకుండా.. ఆరోగ్యశ్రీని కల్పించాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ఇక మిగతా పథకాలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అర్హులైన అందరికి సంక్షేమ పథకాలను అందించడం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రేషన్ కార్డులు కాకుండా కొత్త కార్డులు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులను కేవలం రేషన్ సరుకులకు మాత్రమే వర్తింపజేసేలా ప్రణాళికలు రచిస్తోంది.

అంటే సంక్షేమ పథకాలు పొందాలంటే.. వేరే గుర్తింపు కార్డు ఉండాలి. ఇక రేషన్‌ కార్డు.. కేవలం రేషన్‌ సరుకులను కొనడానికి మాత్రమే ఉపయోగపడనుంది. దీనిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశంపై సానుకూల ప్రతిపాదనలు వస్తే మాత్రం.. కొత్త కార్డులకు తీసువచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొన్ని రోజులు గడిస్తే కానీ దీనిపై ఒక స్పష్టత రానుంది. ఒకవేళ రేవంత్‌ సర్కార్‌ ఇలాంటి నిర ‍్ణయం తీసుకుంటే..అది సంచలనమే కానుంది.

Show comments