HYD ప్రజలకు ఆమ్రపాలి గుడ్ న్యూస్.. ఇక నుంచి అక్కడ ఫ్రీ!

నగరంలో వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య అనేది కూడా ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ పేరుతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న దోపిడీదారులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలను జారి చేశారు.

నగరంలో వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య అనేది కూడా ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ పేరుతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న దోపిడీదారులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలను జారి చేశారు.

తెలంగాణ రాష్ట్ర జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గురించి అందరికీ తెలిసిందే. నగరంలో జీహెచ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి నుంచి విధుల్లో ఈమె తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో.. నగరంలోని పారిశుద్ధ్య నిర్వాహణపై సాధారణ అమ్మాయిలా ఈ మధ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ..అధికారులును పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాకుండా.. నగరంలోని విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ తమ సమస్యలను అడిగి తెలుసుకొని పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే నగరంలోని పలు సమస్యలపై కమిషనర్ ఆమ్రపాలి మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన సమస్య అయిన పార్కింగ్ ఇబ్బందులపై అమ్రపాలి దృష్టి సారించి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నగరంలో వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య అనేది కూడా ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ పేరుతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న దోపిడీదారులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ దోపిడీదారులపై కమిషనర్ ఆమ్రపాలి దృష్టి పెట్టారు. అలాగే పార్కింగ్ పేరిట ఫీజులు వసూళ్లనను నియంత్రించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఈ విషయం పై జీవో.63ను కఠినంగా అమలు చేయాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం నగరంలోని అన్ని సర్కిల్స్ లో అధికార బృందాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాటు కూడా చేశారు. ముఖ్యంగా ఏ షాపింగ్ మాల్ లో అయినా,కమర్షిల్ కాంప్లెక్స్‌లో కానీ, ర్ధగంట పాటు వాహనాన్ని గానీ పార్క్ చేస్తే.. ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని కమిషనర్ ఆమర్పాలి ఆదేశించారు.

అంతేకాకుండా.. ఆయా షాపింగ్ మాల్స్ , కాంప్లెక్స్ ల బిల్స్ గానీ, సినిమా టికెట్స్ ఉంటే.. వారి దగ్గర ఎలాంటి పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని ఆమ్రపాలి స్పష్టం చేశారు. అలాగే మరో వైపు పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారన్నది కూడా వినియోగదారులకు కనిపించేలా ప్రతి మల్టీఫ్లెక్స్ , తియేటర్లలో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈ సమాచారం తెలిసుకున్న వాహనదారులకు కాస్త పార్కింగ్ ఫీజుల బారీ నుంచి ఊరట లభించింది. పైగా కమిషనర్ ఆమ్రపాల్ తీసుకున్న ఈ నిర్ణయం పై నగర ప్రజలు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు. మరి, నగరంలో వాహనదారులకు ఊరటనిస్తూ పార్కింగ్ సమస్య ఆమ్రపాలు జారీ చేసిన ఈ కీలక నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments