P Krishna
Emergency Visa: విదేశాలకు వెళ్లేవారు.. అక్కడ నుంచి వచ్చే వారికి కొన్నిసార్లు ఎయిర్ పోర్టులు ఇబ్బందులు తలెత్తడం చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు ఓ భారతీయ మహిళ ఎయిర్ పోర్టులో ఎదుర్కోవడంతో తెలంగాణ ఎమ్మెల్సీ చొరవ చూపడంతో కధ సుఖాంతం అయ్యింది.
Emergency Visa: విదేశాలకు వెళ్లేవారు.. అక్కడ నుంచి వచ్చే వారికి కొన్నిసార్లు ఎయిర్ పోర్టులు ఇబ్బందులు తలెత్తడం చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు ఓ భారతీయ మహిళ ఎయిర్ పోర్టులో ఎదుర్కోవడంతో తెలంగాణ ఎమ్మెల్సీ చొరవ చూపడంతో కధ సుఖాంతం అయ్యింది.
P Krishna
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చింతల పెల్లి అఖిలేందర్ రెడ్డి కొంత కాలం క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అఖిలేందర్ భార్య శ్రుతి రెడ్డి తండ్రి కోరట్లు మండలం నాగుల పేటకు చెందిన మోహన్‌రెడ్డి. జులై 5న ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తన తండ్రి మరణ వార్త విన్న శ్రుతి రెడ్డి కన్నీరు మున్నీరయ్యింది. తన తండ్రి కడచూపు చూడాలని.. అంత్యక్రియల్లో పాల్గొనాలని కుటుంబ సభ్యులతో కలిసి శ్రుతి రెడ్డి భారత్‌కి బయలుదేరింది. అయితే ఆమెకు ఊహించని సంఘటన ఎదురైంది. ఇంతకీ ఆమెకు ఎదురైన సమస్య ఏంటీ? ఎలా పరిష్కరించారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో ఉంటున్న జిగిత్యాల జిల్లా వాసి చింతపెల్లి అఖిలేందర్ రెడ్డి భార్య శ్రుతి రెడ్డి తండ్రి ఈ నెల 5 న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్రుతి రెడ్డి కుటుంబ సభ్యులతో ఈ నెల 6న భారత్ కి బయలుదేరింది.డల్లాస్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరగా.. ఖత్తర్ ఎయిర్ వేస్ సిబ్బంది వారిని ఆపారు. కారణం శ్రుతి రెడ్డి భారతీయ పౌరురాలు.. అమెరికాలో జన్మించిన ఆహె కూతురు యశ్నకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. భారతీయ మూలాలు ఉన్న వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఈ) కార్డు లేదా ఇండియా విజిట్ వీసా ఉండాలి. ఆరు నెలల యశ్నకు రెండూ లేకపోవడంతో ఖత్తర్ సిబ్బంది పైలెట్ విమానం ఎక్కడానికి అనుమతించలేదు.
ఈ విషయం వెంటనే అఖిలేందర్ తన తండ్రి కొత్తపేట మాజీ ఎంపీటీసీ చింతపల్లి గంగారెడ్డికి సమాచారం అందించాడు. వెంటనే ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఎన్నైరా అధికారి చిట్టిబాబు, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సమన్వయంతో కేంద్ర హూం మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో చర్చించారు. వారు వెంటనే ఆరు నెలల యశ్నకు అత్యవసర విసా ఇప్పించారు. దీంతో శ్రుతి రెడ్డి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి అత్యవసర విసా ఇప్పించడానికి ఎమ్మెల్సీ చూపించిన చొరవకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు శ్రుతిరెడ్డి కుటుంబ సభ్యులు.