School Holiday: ఈవాళ పాఠశాలలకు సెలవు ఉందా.. ప్రభుత్వం ఏం చెబుతుందంటే..!

Heavy Rain-School Holiday: నిన్నటి వరకు విద్యార్థులకు సెలవులే ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. నేడు స్కూళ్లు ప్రారంభం కావాలి. కానీ ఈవాళ కూడా సెలవే అంటున్నారు. ఆ వివరాలు..

Heavy Rain-School Holiday: నిన్నటి వరకు విద్యార్థులకు సెలవులే ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. నేడు స్కూళ్లు ప్రారంభం కావాలి. కానీ ఈవాళ కూడా సెలవే అంటున్నారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి 19 రాఖీ పండుగ వరకు వరుసగా సెలవులు రావడంతో.. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి అనగా.. ఆగస్టు 20, మంగళవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావల్సి ఉంది. అయితే నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు అని సమాచారం. మరి ఇవాళ పాఠశాలలు, కాలేీజీలకు సెలవు ఎందుకు.. అసలేం జరిగిందంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నేడు కూడా సెలవు లభించే అవకాశం ఉంది. కారణం భారీ వర్షాలు. ఇక హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే నగరంలో కుండపోత వాన మొదలయ్యింది. ఇక ఈ రోజంతా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలు నేడు కూడా సెలవు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు.. మంగళవారం నాడు సెలవు ప్రకటించాయి.

అయితే నేడు పాఠశాలలకు సెలవు అనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  కానీ చాలా చోట్ల ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇవాళ కొన్ని స్కూళ్లకు సెలవు ఉంది. నేడు భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు.. హెచ్చరికలు జారీ చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. దాంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు.

హైదరాబాద్‌లో భారీ వర్షం పడితే.. ప్రధానంగా రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారు. రోడ్ల మీద మోకాళ్ల లోతు వరకు నీరు చేరి.. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఏందో అర్థం కాదు. పైగా చాలా ప్రాంతాల్లో డ్రైనీజీలు పొంగి పొర్లుతున్నాయి. వీటి వల్ల విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే తల్లిదండ్రులు కూడా నేడు పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Show comments