Keerthi
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధనను తీసుకొస్తామని విద్యాశాఖ కమిషన్ తాజాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యావ్యవస్థ బలోపేతంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధనను తీసుకొస్తామని విద్యాశాఖ కమిషన్ తాజాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యావ్యవస్థ బలోపేతంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజసంక్షేమం కోసం ఇచ్చి హామీలను పూర్తి చేయడంలో చకచక ముందుకు సాగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నేరవేర్చిన దిశగా సర్కార్ ముందకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలోని విద్యావ్యవస్థను కూడా పటిష్టం చేసేందుకు సర్కార్ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విద్యార్థులకు సరైన నైపుణ్యలు పెంపోందించి,నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. విద్య శాఖ వ్యవస్థలోని బోధనలను మరింత పెంపొందించలని తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే త్వరలోనే విద్యావ్యస్థలో ఈ ఏర్పాట్లు చేస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం పునాదిగా ఏర్పాడునుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధనను తీసుకొస్తామని విద్యాశాఖ కమిషన్ తాజాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యావ్యవస్థ బలోపేతంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే తెలంగాణలోని ప్రతి మండలానికి మూడు చొప్పున.. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అందుకోసం సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుదని ఆయన తెలిపారు. ఇక ఈ రెసిడన్షియల్ స్కూల్లకు 15 నుంచి 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన భట్టి విక్రమార్క వెల్లడించారు. అయితే ఒక్కో స్కూల్ నిర్మాణనికి దాదాపు రూ.80- రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఇక ఈ పాఠశాల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని ఆయన చెప్పారు. పైగా ఈ స్కూళ్లలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు స్కూలు భవనంలోనే వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలా చేయడం వలన విద్యార్థులకు టీజర్లు అన్ని వేలలా అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్లలో ఎల్‌కేజీ నుంచి మూడో తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఇక ఈ అంగన్‌వాడీల్లో మూడో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తయ్యాక.. ఆ విద్యార్థులను 4వ తరగతి నుంచి కొత్తగా నిర్మించే ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలోకి ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. పైగా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండలేని విద్యార్థులకు డే స్కాలర్ సౌకర్యమూ కూడా కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అలాగే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. మరి, త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.