Ration Card: రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఏకంగా 6 కేజీల వరకు

TG Ration Card Holders -Sannabiyyam: రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

TG Ration Card Holders -Sannabiyyam: రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ.. ముందుకు సాగుతోంది. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోల్కొండ కోటలో జెండా ఎగురవేశారు. అంతకముందు అమరవీరులకు నివాళు అర్పించారు. జెండా  ఎగురవేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నేడు మూడో విడత రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి వారి నియోజకవర్గాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఎగురవేశారు. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

రేషన్ కార్డు దారులకు 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క.. జెండా ఎగురవేసిన తర్వాత.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలోనే రేషన్ కార్డు దారులకు 6 కిలోల సన్నబియ్య ఇస్తామన్నారు. అలానే తమ ప్రభుత్వం వయవసాయ రంగానికి మద్దతివ్వడం కోసం రైతు రుణమాఫీతో పాటు.. కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం, డివిజన్ స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు. అంతేకాక రాయితీపై వివిధ రకాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన వరంగల్‌ డిక్లరేషన్‌ హామీ మేరకు ప్రస్తుతం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల మాఫీ అయిందని.. నేడు మూడో విడత మాఫీ చేయనున్నట్లు చెప్పారు. అయితే సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ వర్తించలేదని.. అలాంటి వారి కోసం కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Show comments