School Teacher: బార్బర్ అవతారమెత్తిన టీచర్.. 8 మంది విద్యార్థులకు దారుణంగా..

బార్బర్ అవతారమెత్తిన టీచర్.. 8 మంది విద్యార్థులకు దారుణంగా..

తల్లిదండ్రుల తర్వాత దైవంగా భావించేది గురువులనే. వారి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ.. తప్పుఒప్పులను సరిచేసుకుంటూ ముందు సాగాలి విద్యార్థి. అలాగే విద్యార్థులు చేసే పొరపాట్లను చాలా ఓపికగా సరిదిద్దాల్సిన బాధ్యత కూడా టీచర్లపై ఉంది. అంతే కానీ..

తల్లిదండ్రుల తర్వాత దైవంగా భావించేది గురువులనే. వారి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ.. తప్పుఒప్పులను సరిచేసుకుంటూ ముందు సాగాలి విద్యార్థి. అలాగే విద్యార్థులు చేసే పొరపాట్లను చాలా ఓపికగా సరిదిద్దాల్సిన బాధ్యత కూడా టీచర్లపై ఉంది. అంతే కానీ..

గురు బ్రహ్మ,గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ: అనే గొప్ప శ్లోకం ఉంది. ఇది గురువు గొప్పతనాన్ని, విద్య అందించే మహా జ్ఞానాన్ని చెబుతుంది. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావించి, విద్యా బుద్దులు నేర్చుకుంటూ..బంగారు బాటలు వేసుకోవాలి. అలాగే పిల్లలు చేసే తప్పులను సరిదిద్ది వారిని మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంది. ఏదో పాఠం చెప్పేశాం, వెళ్లిపోయాం అని కాకుండా ప్రయోజకుల్ని చేసే గురుతర బాధ్యత కూడా నిర్వర్తించాలి. అయితే విద్యార్థులు అన్నాక పొరపాట్లు, తప్పులు, అల్లరి లేదా చిలిపి పనులు చేస్తుంటారు. అదే విద్యార్థి దశకు అందం కూడా. కానీ టీచర్లు నయాన్నో భయాన్నో చెప్పాలి కానీ కఠిన చర్యలు తీసుకుంటే.. వారి మనస్సులపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తుంది. తాజాగా టీచర్ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఈ మధ్య ఫ్యాషన్ పోకడ ఎక్కువయ్యి.. విద్యార్థి దశ నుండే దాన్ని అవలంభిస్తున్నారు కొంత మంది స్టూడెంట్స్. రకరకాలుగా హెయిల్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు. ఇదిగో ఈ చర్యలే ఓ టీచరమ్మ కోపానికి కారణమయ్యాయి. చివరకు చిరాకు వచ్చి.. ఆమె బార్చర్ అవతారం ఎత్తింది. వచ్చీ రానీ కటింగ్‌తో విద్యార్థులకు జుట్టు కట్ చేసింది. ఇది పేను కొరుకుడిలా అనిపించింది. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే టీచర్.. ఇంగ్లీష్ బోధిస్తుంది. తన క్లాసులో జుట్టు వత్తుగా పెంచి వస్తున్న విద్యార్థులకు నీట్‌గా కటింగ్ చేయించుకురావాలని సూచించింది. ఎన్ని సార్లు చెప్పినా అలాగే పాఠశాలకు వస్తున్నారని భావించిన టీచర్ శిరీష.. ఇక తానే బార్చర్ అయ్యింది.

8 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించింది ఆ ఇంగ్లీష్ టీచర్. ఓ కత్తెర తీసుకుని కట్ చేసింది. ఆమె ఫ్రొఫెషనల్ కాదు కదా.. అందుకే వికారంగా తయారయ్యింది విద్యార్థుల తల. తల్లిదండ్రులు చూసి అవాక్కయ్యారు. స్కూల్ వద్దకు వెళ్లి టీచరమ్మను నిలదీయడంతో పాటు ఆందోళన చేపట్టారు. టీచరమ్మ పాటాలు మాత్రమే చెప్పాలని, అనవసరపు పెత్తనం చేయొద్దంటూ మండిపడ్డారు. పిల్లలు మనస్థాపంతో ఏదైనా చేసుకుంటే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు జోక్యం చేసుకున్నారు. టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show comments