TESLA నుంచి క్రేజీ ఫోన్..ఛార్జింగ్ అక్కర్లే, ఇంటర్నెట్ తో పనిలే.. నిజమెంత? పూర్తి వివరాలు!

Tesla: టెస్లా నుంచి క్రేజీ స్మార్ట్ ఫోన్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది.

Tesla: టెస్లా నుంచి క్రేజీ స్మార్ట్ ఫోన్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది.

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా కూడా సెన్సేషనే. ఆయన ఏం చేసినా కూడా కొత్తగా ఉంటుంది. ప్రపంచంలో ఎంత మంది బిజినెస్ మ్యాన్లు ఉన్నా కూడా ఎలాన్ మస్క్ రూట్ మాత్రం సెపరేట్ అనే చెప్పాలి. నిజానికి ఆయన నిర్ణయాలు అన్ని కూడా ఊహాతీతంగా ఉంటాయి. అసలు ఎంతటి అసాధ్యమైన పనైనా సుసాధ్యం చేసే కెపాసిటీ ఎలాన్ మస్క్ కి ఉందంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రపంచం అంతా కూడా అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచిస్తున్న టైమ్ లోనే దాన్ని సుసాధ్యం చేస్తాడు. అలాంటి పని మాంత్రికుడు ఎలాన్ మస్క్. అందుకే ప్రపంచంలోనే టాప్ 1 అపర కుబేరుడయ్యాడు. సాఫ్ట్‌వేర్‌ నుంచి హార్డ్‌ వేర్‌ దాకా.. ఆన్‌ లైన్‌ పేమెంట్‌ నుంచి స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ దాకా ఎలాన్ మస్క్‌ అడుగు పెట్టని ఇండస్ట్రీనే లేదు. అలా అతను అడుగు పెట్టిన ప్రతి ఇండస్ట్రీ కూడా ప్రపంచాన్నే షేక్ చేసేసింది. మహర్షి సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా.. ఈ ప్రపంచాన్నే ఏలేద్దాం అనుకుంటున్నా అని.. ఆ డైలాగ్ ఎలాన్ మస్క్ కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. అంతలా తన నిర్ణయాలతో ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు.

ఇక అలాంటి మస్క్‌ నుంచి ఓ కొత్త ఫోన్‌ రాబోతోంది అనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను తెగ ఊపేస్తుంది. టెస్లా నుంచి ఇప్పటికే కార్లు రిలీజ్‌ చేసిన మస్క్‌ ఇప్పుడు అదే బ్రాండ్‌ లోగోతో ఫోన్‌లు కూడా తయారు చేస్తున్నాడనే టాక్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎలాన్ మస్క్ ఫోన్లని లంచ్ చేయడం ఆయనకి పెద్ద పనేమి కాదు. అయితే ఆయన బ్రాండ్ ఫోన్ అంటే అంచనాలు తారా స్థాయికి చేరాయి.టెస్లా లోగోతో స్మార్ట్ ఫోన్ ఫొటోలు కొన్ని ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫోన్‌ ఎంత క్రేజీగా ఉందో.. ఫోన్‌ ఫీచర్స్‌ కూడా అంతే క్రేజీగా ఉన్నాయని, మతి పోగొట్టె రెండు ఫీచర్స్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక అందులో ఒకటి సోలార్‌ ఛార్జింగ్‌. అంటే ఈ ఫోన్‌కు మనం చార్జింగ్‌ పెట్టాల్సిన పని లేదట. డైరెక్ట్ గా సూర్యుడి నుంచి వచ్చే సన్‌లైట్‌తో ఆ ఫోన్ ఛార్జ్‌ అవుతుందట. ఇంకో హైలెట్‌ ఫీచర్ ఏంటి అంటే ఈ ఫోన్‌కు ఇంటర్నెట్‌ తో కూడా పని లేదట. ఎందుకంటే ఎలాన్‌ మస్క్‌ స్టార్ లింక్‌ కంపెనీతో ఈ ఫోన్‌ను కనెక్ట్‌ చేస్తారట. ఈ ఫోన్ అంతా కూడా స్టార్‌లింక్‌ బేస్‌గానే నడుస్తుందట. అంటే కేవలం మన భూమి మీదే కాదు.. ఆకాశంలోకి వెళ్ళినా చంద్రుడి మీదకు వెళ్లినా కూడా మనం ఈ టెస్లా ఫోన్‌తో కాల్స్‌ మాట్లాడుకోవచ్చట. 2024 అయిపోయేలోపు ఈ ఫోన్‌ను ఎలాన్‌ మస్క్‌ లాంఛ్‌ చేయబోతున్నాడు అని ఇంటర్నెట్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యాపిల్ ఐఫోన్ పనైపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు,ఒకవేళ లాంచ్ చేస్తే దీంట్లో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ ఉంటాయంటూ ఎక్కడా కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయినా కూడా ఈ వార్తలు ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. కానీ ఎలాన్ మస్క్ తలచుకుంటే ఈ ఫోన్ తయారు కావడం ఒక లెక్క అనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. కేవలం ఆయనకు ఉన్న బ్రాండ్ వాల్యుని అంచనా వేసుకొని ఈ ఫోన్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనే వార్తలు పుట్టిస్తున్నారు. అంతే తప్ప ఇలాంటి ఫీచర్స్ తో ఫోన్ రాబోతుంది అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ వార్తలు నిజమో అబద్దమో అన్న విషయం పక్కన పెడితే.. ఈ రెండు ఫీచర్స్‌ మాత్రం నెటిజన్లకు ఆహా ఈ ఊహా ఎంత బాగుందో అనేలా చేస్తున్నాయి. మరి ఫ్యూచర్ లో ఎలాన్ మస్క్ ఆహా అనిపించే ఈ ఊహాని నిజం చేస్తాడో లేదో చూడాలి. ఇదీ సంగతి.. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments