CERT In Alert For Google Chrome Users: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరికలు.. ఏం జరిగిందంటే

Google Chrome: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరికలు.. ఏం జరిగిందంటే

Google Chrome-CERT In Alert: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎందుకంటే

Google Chrome-CERT In Alert: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎందుకంటే

నేటి కాలంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాము. ఇక నేటి కాలంలో ప్రతి చిన్నా, పెద్ద సమాచారం కోసం గూగుల్ మీద ఆధారపడుతున్నాం. ఎలాంటి సమాచారం కావాలన్నా.. గూగుల్ చేస్తాము. ఆఖరికి ఎక్కడికైనా వెళ్లాలన్నా.. సరే గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతున్నాం. ప్రతి మొబైల్, ట్యాబ్యెట్ లలో గూగుల్ సర్చ్ ఇంజీన్ కచ్చితంగా వస్తుంది. రోజుకు ఒక్కసారైనా గూగుల్ క్రోమ్ వాడతాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్రోమ్ వాడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..

విండోస్‌, మ్యాక్‌ఓస్‌ ఆపరేటింగ్స్‌ సిస్టమ్స్‌లపై గూగుల్ క్రోమ్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌ హెచ్చరించింది. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో బగ్‌లు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. వీటిని ఉపయోగించుకుని హ్యాకర్లు అటాక్‌ చేసే అవకాశాలు ఉన్నాయని సీఈఆర్టీ చెప్పుకొచ్చింది.

గూగుల్ క్రోమ్ లో ఉన్న బగ్ ల కారణంగా వినియోగదారుల సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకున్న ముఖ్యమైన డేటాను, పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు కొట్టేసే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవాలంటే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఉపయోగించేవారు వెంటనే దాన్ని అప్డేట్ చేయాలని సంస్థ సూచించింది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను గూగుల్ క్రోమ్ లలో ఉండే బగ్ లు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది.

కనుక ఇలాంటి గ్యాడ్జెట్స్‌ ఉపయోగించే వారు కూడా క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సీఈఆర్టీ సూచించిది. ఇదిలా ఉంటే గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఈ భద్రతా లోపం సుమారు 18 ఏళ్ల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని డెవలపర్లు గుర్తించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిపైనే తాజాగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కనుక క్రోమ్ వినియోగదారులు తమ డివిజై లను అప్డేట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు.

Show comments