టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందని కంగారు పడుతున్నారా? ఆల్టర్నేటివ్ యాప్స్ ఇవే

Best Alternative Apps For Telegram In India: టెలిగ్రామ్ ఫౌండర్ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. భారత్ లో టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేస్తారు అని కూడా అంటున్నారు. అయితే ఈ యాప్ కి ఆల్టర్నేటివ్ గా ఉన్న యాప్స్ ఏవో చూద్దాం.

Best Alternative Apps For Telegram In India: టెలిగ్రామ్ ఫౌండర్ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. భారత్ లో టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేస్తారు అని కూడా అంటున్నారు. అయితే ఈ యాప్ కి ఆల్టర్నేటివ్ గా ఉన్న యాప్స్ ఏవో చూద్దాం.

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా వైరల్ సంగతి తెలిసిందే. ఈ విషయం టెక్ ప్రపంచాన్ని ఊపేసింది. అసాంఘిక కార్యకలాపాలు, అభ్యంతకర వీడియోల విషయంలో టెలిగ్రామ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ వార్త వైరల్ అయిన తర్వాత మరో వార్త ఒకటి భారతీయులను కాస్త కంగారు పెట్టేసింది. అదేంటంటే.. టెలిగ్రామ్ యాప్ ని భారత్ లో బ్యాన్ చేస్తున్నారు.. అంటూ చాలానే వార్తలు వచ్చాయి. ఒకవేళ నిజంగానే టెలిగ్రామ్ బ్యాన్ అయిపోతో ఏంటి పరిస్థితి? టెలిగ్రామ్ యాప్ కు ఆల్టర్నేటివ్ యాప్స్ ఏం లేవా? అంటే ఉన్నాయి. మరి.. ఆ యాప్స్ ఏంటో చూద్దాం.

వాట్సాప్:

టెలిగ్రామ్ కి అనే కాదు.. ఎన్నో రకాల యాప్స్ కి ప్రధాన ప్రత్యామ్నాయం వాట్సాప్ అనే చెప్పాలి. ఈ వాట్సాప్ యాప్.. టెలిగ్రామ్ అతి పెద్ద పోటీ కూడా. ఇందులో మీకు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. మీ వ్యక్తిగత గోప్యతకు వాట్సాప్ సరైన ఎంపిక అని సంస్థ చెబుతూ ఉంటుంది. అయితే ఈ వాట్సాప్ పై పావెల్ దురోయ్ పలుసార్లు సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మైక్రోసాఫ్ట్ టీమ్స్:

టీమ్స్ అనేది జస్ట్ మెసేజింగ్ యాప్ అని మాత్రం అనుకోకండి. ఇది మైక్రోసాఫ్ట్ 365కి అనుసంధానంగా ఉండే ప్లాట్ ఫామ్. వ్యక్తిగతమైన మాత్రమే కాకుండా.. ఉద్యోగ రీత్యా కూడా ఇది చాలా సురక్షితమైన ప్లాట్ ఫామ్ అని టెక్ నిపుణులు చెబుతారు. అలాగే ఇది కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ కలిగి ఉంటుంది.

సిగ్నల్:

మీరు గ్రూప్ చాట్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, అలాగే మెసేజుల కోసం ఒక మంచి యాప్ కావాలి.. సురక్షితంగా ఉండాలి అనుకుంటే మాత్రం సిగ్నల్ మీకు సరైన ఎంపిక. ఈ సిగ్నల్ యాప్ లో మీకు ప్రైవసీకి పెద్ద పీట వేశారు. అలాగే ఇందులో ఎవరూ స్క్రీన్ షాట్స్ కూడా తీయలేరు. తీయకుండా అడ్డుకునే ఫీచర్స్ ఉంటాయి. మీ సమాచారం ఎంతో గోప్యంగా, సురక్షితంగా ఉంటుంది.

మేటర్ మోస్ట్:

మీ బిజినెస్ కోసం, మీ కంపెనీ కోసం, మీ టీమ్ కి ఏదైనా సమాచారాన్ని చేరవేయడానికి.. టీమ్ మొత్తం ఒక దగ్గర కాంటాక్ట్ లో ఉండాలి అనుకుంటే మీరు ఈ మేటర్ మోస్ట్ అనే యాప్ ని వాడుకోవచ్చు. పైగా ఇది కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ సంస్థలకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. ఇందులో మీకు ప్రైవేట్ రూమ్స్, ఫైల్ షేరింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి.

బ్రోసిక్స్:

వ్యాపారాల కోసం ఒక మంచి యాప్ ని మీరు వాడుకోవాలి అనుకుంటే మాత్రం మీకు ఈ బ్రోసిక్స్ యాప్ సరిగ్గా సరిపోతుంది. ఈ బ్రోసిక్స్ అనే యాప్ మెయిన్ మోటోనే బిజినెస్ పీపుల్ కు ఉపయుక్తంగా ఉండాలి అని. ఎందుకంటే ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక దగ్గర చేర్చడానికి బాగా పనికొస్తుంది. ఇందులో మీకు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. అలాగే మీకు చాట్ హిస్టరీ ఆర్కైవ్, చాట్ రూమ్ కంట్రోల్స్, వర్చువల్ వైట్ బోర్డ్ మాత్రమే కాకుండా.. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ బ్యాన్ అయితే మంచిదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments