Somesekhar
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్. ఇక తన బ్యాటింగ్ తో ఏకంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేశాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్. ఇక తన బ్యాటింగ్ తో ఏకంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేశాడు.
Somesekhar
ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ను భారత్ 3-1 తేడాతో గెలిచింది అంటే.. దానికి ముఖ్య కారణం టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఈ సిరీస్ లో పరుగుల వరదపారిస్తూ.. అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. సీనియర్లు విఫలమైన చోట తానున్నానంటూ.. టీమ్ ను ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పలు భారీ రికార్డులను బద్దలుకొడుతూ.. ముందుకుసాగుతున్నాడు ఈ యువ కెరటం. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్ మెన్స్ ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేశాడు.
యశస్వీ జైస్వాల్.. ఆడింది 8 టెస్ట్ మ్యాచ్ లే.. కానీ 971 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు, 3 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దంచికొడుతున్నాడు. నాలుగు టెస్ట్ ల్లో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. అందులో వరుసగా రెండు ద్విశతకాలు కూడా ఉండటం విశేషం. నాలుగో టెస్ట్ లో 73, 37 పరుగులు చేసిన జైస్వాల్ తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో సత్తాచాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేసి ముందుకు వెళ్లిపోయాడు ఈ యువ సంచలనం.
లేటెస్ట్ గా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 12వ స్థానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 2 రన్స్ మాత్రమే చేయడంతో.. ఒక ర్యాంక్ దిగజారి 13వ ప్లేస్ కు పడిపోయాడు. ప్రస్తుతం 727 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు యశస్వీ జైస్వాల్, 720 రేటింగ్ పాయింట్లతో రోహిత్ ఉన్నాడు. కాగా ఈ లిస్ట్ లో 893 పాయింట్లతో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వరుసగా స్టీవ్ స్మిత్, జో రూట్, డార్లీ మిచెల్, బాబర్ అజామ్ లు ఉన్నారు. టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ 744 రేటింగ్ పాయింట్స్ తో 9వ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరి సూపర్ ఫామ్ తో ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Yashasvi Jaiswal moves to number 12 in ICC Test batters ranking.
– He is 2nd behind Virat Kohli among Indians, What a growth. 🫡 pic.twitter.com/Bo46JttI0C
— Johns. (@CricCrazyJohns) February 28, 2024
ఇదికూడా చదవండి: లైవ్ మ్యాచ్ లో లేడీ క్రికెటర్ కు పెళ్లి ప్రపోజల్.. రిప్లై ఏంటంటే?