Bajrang Punia: జాతీయ జెండాను పొరపాటున తొక్కిన వెటరన్ రెజ్లర్!

Bajrang Punia: భారతీయ రెజ్లర్ గా బజరంగ్ పూనియా అందరికి సుపరిచితమే. తాజాగా పూనియా చిక్కుల్లో పడ్డాడు.

Bajrang Punia: భారతీయ రెజ్లర్ గా బజరంగ్ పూనియా అందరికి సుపరిచితమే. తాజాగా పూనియా చిక్కుల్లో పడ్డాడు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్‌కు తీరని అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. ఆమెకు అనవసరంగా వేటు‌ వెయ్యడంతో ఫైనల్ కి అర్హత సాధించలేదు.తనకు జరిగిన అన్యాయానికి ఆమె న్యాయ పోరాటం చేసింది. కానీ అందులో కూడా ఆమెకు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె కష్టం వృధా అయ్యింది. దాంతో దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు లభించింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్ మంచి ప్రదర్శనతో ఫైనల్ దాకా వెళ్లి సిల్వర్ మెడల్ ఖాయం చేసుకుంది. కానీ ఆఖరి పోరాటానికి ముందు 100 గ్రాముల అధిక బరువుతో అనవసరంగా ఆమె వేటుకు గురయ్యింది. దాంతో ఆమెకు ఏ మెడల్ కూడా రాకుండా పోయింది.

ఫైనల్ మ్యాచ్ కి వెళ్లే క్రమంలో ఆమె ఎలాంటి తప్పులు చేయలేదని వాదించింది. తనకు కచ్చితంగా సిల్వర్ మెడల్ ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)‌‌ను వినేష్ ఫోగట్ ఆశ్రయించింది. కానీ పాపం ఈ న్యాయ పోరాటంలో కూడా ఆమెకు అన్యాయమే జరిగింది. వినేష్ ఫోగట్‌ పిటిషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ బుధవారం(ఆగస్ట్ 16) నాడు తీర్పుని ఇచ్చింది.. దాంతో ఆమె మెడల్ పై పెట్టుకున్న కొండంత ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి.ఇక శనివారం నాడు ఇండియాకి చేరకున్న వినేష్ ఫోగట్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మెడల్ లేకుండా వచ్చినా కానీ కుటుంబ సభ్యులు,తోటి రెజ్లర్లు, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు ఆమెకు తోడుగా వచ్చారు.

ఈ క్రమంలో కార్ సన్ రూఫ్ నుంచి వినీష్ ఫోగట్ అందరికి అభివాదం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆమెతో మాట్లాడేందుకు మీడియా వర్గాల వారు ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టారు. దాంతో ఆ కార్ ముందుకు కదల్లేకపోయింది. ఇక అక్కడ వున్న రెజ్లర్ బజరంగ్ పూనియా ముందుకు వచ్చి వారిని తప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అతను ఆ టైంలో ఓ పొరపాటు చేశాడు.ఆ సమయంలో అతను చూసుకోకుండా కారుపై ఉన్న మన జాతీయ జెండా స్టిక్కర్స్‌ను తొక్కడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన జాతీయ జెండాని కచ్చితంగా గౌరవించాలని, దాన్ని చూసుకోకుండా అలా ఎలా తొక్కావంటూ తెగ మండిపడుతున్నారు. జాతీయ జెండాని తొక్కినందుకు కచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అతను చేసిన ఆ పొరపాటుకు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

 

Show comments