రోహిత్ కంటే తోపు.. అయినా టీమిండియాలో నో ఛాన్స్! ఈ అన్​లక్కీ హీరో గురించి తెలుసా?

Duleep Trophy 2024, Abhimanyu Easwaran, Team India: క్రికెట్​లో టాప్​ లెవల్​కు వెళ్లాలంటే టాలెంట్ ఎంత ఉన్నా ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. లక్ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా నో యూజ్. ఈ ప్లేయర్​కు అదే మిస్ అయింది. టీమిండియాలో ఉండాల్సినోడు ఫస్ట్​క్లాస్​ క్రికెట్​కే పరిమితం అయ్యాడు.

Duleep Trophy 2024, Abhimanyu Easwaran, Team India: క్రికెట్​లో టాప్​ లెవల్​కు వెళ్లాలంటే టాలెంట్ ఎంత ఉన్నా ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. లక్ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా నో యూజ్. ఈ ప్లేయర్​కు అదే మిస్ అయింది. టీమిండియాలో ఉండాల్సినోడు ఫస్ట్​క్లాస్​ క్రికెట్​కే పరిమితం అయ్యాడు.

క్రికెట్​లో టాప్​ లెవల్​కు వెళ్లాలంటే టాలెంట్ ఎంత ఉన్నా సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే కెరీర్​లో ఓ స్థాయికి చేరుకోగలరు. ప్రతిభకు లక్ కూడా తోడైతే వాళ్లను ఆపడం ఎవరి వల్లా కాదు. కొందరు ఆటగాళ్లైతే లక్​తో వెలుగులోకి వచ్చి ఆ తర్వాత తమ టాలెంట్​కు మెరుగులు దిద్దుకొని అత్యున్నత స్థాయికి అందుకోవడం చూసే ఉంటారు. ఇదే టైమ్​లో ఎంత టాలెంట్ ఉన్నా లక్, టైమ్ కలసిరాక అనామకులుగా మిగిలిపోయిన వారి గురించీ వినే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్లేయర్ రెండో కేటగిరీకి చెందినోడు. టీమిండియాలో ఉండాల్సినోడు ఫస్ట్​క్లాస్​ క్రికెట్​కే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్​ బ్యాటింగ్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను మించినోడు ఛాన్సులు రాక, గుర్తింపు లేక ఓ సగటు ప్లేయర్​గా ఉండిపోయాడు. అతడే అభిమన్యు ఈశ్వరన్.

ఇండియన్ క్రికెట్​లో ఈ తరం చూసిన గొప్ప డొమెస్టిక్ క్రికెటర్స్​లో అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. టీమిండియాకు ఆడిన వారిలో ఛటేశ్వర్ పుజారాది ఏ రేంజో అదే స్థాయి ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అభిమన్యుది. దేశవాళీ క్రికెట్​లో అతడు చూడని విజయం లేదు. టన్నుల కొద్దీ పరుగులు, భారీ శతకాలు, అనేక రికార్డులు అతడి ఖాతాలో ఉన్నాయి. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 95 మ్యాచుల్లో కలిపి 7023 పరుగులు చేశాడు అభిమన్యు ఈశ్వరన్. ఇందులో 23 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో రోహిత్ శర్మ చేసిన స్కోరు (59 మ్యాచుల్లో 4137 పరుగులు) కంటే ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అభిమన్యు చేసిన స్కోరు దాదాపుగా డబుల్. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్ ఆడకుండా వెళ్లడు అభిమన్యు. క్లిష్ట పరిస్థితుల్లో టీమ్​ను ఆదుకోవడంలో, అలాగే క్లాస్ ఇన్నింగ్స్​లతో జట్టును విజయాల బాటలో నడపడంలో అతడు ఎక్స్​పర్ట్.

ఇండియా-సీతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్​లోనూ అభిమన్యు సెంచరీతో మెరిశాడు. 262 బంతుల్లో 143 పరుగులు చేశాడు. ఇందులో 12 బౌండరీలు, ఓ సిక్స్ ఉన్నాయి. బ్యాటర్లంతా ఫెయిలైనా అతడో స్తంభంలా ఒక ఎండ్​లో పాతుకుపోయాడు. సాలిడ్ డిఫెన్స్​తో పాటు స్ట్రైక్ రొటేషన్​కు ప్రాధాన్యత ఇస్తూ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. దీంతో అభిమన్యు గురించి అంతా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడి రికార్డులు తెలిశాక టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్స్ నిలదీస్తున్నారు. టెస్టుల్లో ఇలా ఓపికతో, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడే బ్యాటర్​ను ఎందుకు మిస్ చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు.. ఈ డొమెస్టిక్ హీరోను భారత జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. అదే అతడికి ఇచ్చే గౌరవమని.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తనను తాను ప్రూవ్ చేసుకుంటాడని అంటున్నారు. మరి.. అభిమన్యు ఈశ్వరన్​ను టీమిండియాలోకి తీసుకోవాలా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments