Somesekhar
శ్రీలంకపై టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత రింకూ సింగ్ ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ట్రోఫీని పట్టుకోలేదు, అందరి మధ్యలోకి రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి గంభీర్ ఎందుకు అలా చేశాడు?
శ్రీలంకపై టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత రింకూ సింగ్ ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ట్రోఫీని పట్టుకోలేదు, అందరి మధ్యలోకి రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి గంభీర్ ఎందుకు అలా చేశాడు?
Somesekhar
కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్ తో శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా టీ20 సిరీస్ లో దుమ్మురేపింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ సిరీస్ గెలుపులో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన స్ట్రాటజీని చూపించాడు. అలాగే న్యూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సైతం టీమ్ ను బ్యాలెన్స్ చేస్తూ.. అద్భుతంగా నడిపించాడు. ఇక సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీని అందుకుని ఫొటో దిగాల్సిందిగా గంభీర్ ను రింకూ సింగ్, రియాన్ పరాగ్ రిక్వెస్ట్ చేశారు. కానీ అతడు మాత్రం ట్రోఫీని టచ్ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ట్రోఫీని గంభీర్ ఎందుకు ముట్టుకోలేదు?
హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్ నే విజయవంతంగా ముగించాడు గౌతమ్ గంభీర్. తన మార్క్ వ్యూహాలతో శ్రీలంకను 3-0తో చిత్తు చేశాడు. రియాన్ పరాగ్ ను కొత్త ఆల్ రౌండర్ గా, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ను పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకున్న తీరు అద్భుతం. ఎవ్వరూ ఊహించని విధంగా రింకూ, సూర్యలతో చివరి టీ20లో బౌలింగ్ చేయించి.. ఫలితం రాబట్టాడు గంభీర్. అయితే తన వ్యూహాలతో సిరీస్ గెలిపించిన గంభీర్.. సెలబ్రేషన్స్ లో మాత్రం వెనకాలే ఉండిపోయాడు. రింకూ సింగ్ ఎంత బతిమిలాడినా ట్రోఫీని పట్టుకోలేదు. అసలేం జరిగిందంటే?
శ్రీలంకపై సిరీస్ గెలిచిన అనంతరం ట్రోఫీని అందుకున్న సూర్యకుమార్ జట్టు సభ్యులతో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చాడు. సపోర్ట్ స్టాఫ్ ను కూడా ఫొటోకు ఆహ్వానించాడు సూర్య. ఈ క్రమంలో కోచ్ గంభీర్ తో సహా అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చారు. కానీ గంభీర్ మాత్రం చివర్లో నిల్చున్నాడు. ఇది గమనించిన రింకూ, పరాగ్ లు గంభీర్ ను ట్రోఫీ అందుకుని, మధ్యలోకి రావాలని రిక్వెస్ట్ చేశారు. కానీ గంభీర్ మాత్రం రాలేదు. అయితే రింకూ మాత్రం చాలా సేపు గంభీర్ ను బతిమిలాడాడు. కానీ ట్రోఫీని పట్టుకోవడానికి అతడు నో చెప్పాడు. అలాగే చివర్లో నిల్చుండిపోయాడు గంభీర్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక గంభీర్ ట్రోఫీని అందుకోకపోవడానికి ప్రత్యేకించి కారణాలు ఏవీ లేవు. ఇది ఆటగాళ్లు సాధించిన సమష్టి విజయం కాబట్టి వారే దానికి అర్హులుగా భావించి.. గంభీర్ ఇలా చేశాడని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి గంభీర్ ట్రోఫీని పట్టుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— The Game Changer (@TheGame_26) July 31, 2024