టీమ్​ను వీడిన విరాట్ కోహ్లీ.. హఠాత్తుగా అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

  • Author singhj Published - 04:04 PM, Mon - 2 October 23
  • Author singhj Published - 04:04 PM, Mon - 2 October 23
టీమ్​ను వీడిన విరాట్ కోహ్లీ.. హఠాత్తుగా అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?

వరల్డ్ కప్-2023 ప్రారంభానికి ముందు తన రెండో వార్మప్ మ్యాచ్​ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్​తో జరగాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన నేపథ్యంలో రెండో వార్మప్ మ్యాచైనా జరగాలని టీమిండియా కోరుకుంటోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం టీమ్​తో కలసి రాలేదని తెలుస్తోంది. అతడు సడెన్​గా బ్రేక్ తీసుకున్నాడట. కోహ్లీ హఠాత్తుగా ముంబైకి పయనమయ్యాడని స్పోర్ట్స్ మీడియా సంస్థలు తమ కథనాల్లో వెల్లడించాయి. మొదటి వార్మప్ మ్యాచ్ రద్దుతో టీమిండియా.. గువాహటి నుంచి తిరువనంతపురం బయల్దేరింది.

విరాట్ కోహ్లీ మాత్రం టీమ్ మేనేజ్​మెంట్​ అనుమతితో సెలవు తీసుకొని ముంబై ఫ్లైట్ ఎక్కాడని సమాచారం. దీనిపై నేషనల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. పర్సనల్ రీజన్స్ వల్ల అతడు జట్టును వీడినట్లు కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి. అయితే కోహ్లీ సోమవారం సాయంత్రం తిరిగి జట్టుతో చేరతాడట. నెదర్లాండ్స్​తో వార్మప్ మ్యాచ్​లో అతడు ఆడతాడని సమాచారం. విరాట్ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతున్నట్లు న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ ముంబైకి వెళ్లడం ఇంట్రెస్టింగ్​గా మారింది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ఇటీవల ముంబైలోని ఒక గైనకాలజీ హాస్పిటల్ దగ్గర కనిపించారని వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ న్యూస్ వచ్చింది. కొన్నాళ్లు ప్రేమించుకున్న కోహ్లీ-అనుష్క జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ స్టార్ కపుల్​కు 2021 జనవరిలో వామిక అనే పాప జన్మించింది. ఇక, గువాహటి వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి వార్మప్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. వరల్డ్ కప్ టోర్నీకి ముందు చివరిదైన రెండో వార్మప్ మ్యాచ్.. మంగళవారం తిరువనంతపురంలో జరగనుంది. పసికూన నెదర్లాండ్స్​తో జరిగే ఈ మ్యాచ్​కు కూడా వాన గండం ఉంది.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో ఇంగ్లండ్ బలాలు, బలహీనతలు! రెండో సారి కప్ గెలిచే ఛాన్స్?

Show comments