Nidhan
Virat Kohli Chant Om Namah Shivay Against Australia: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ సీక్రెట్స్లో ఒకటి రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో పదే పదే ఆ మంత్రాన్ని తలచుకుంటానని చెప్పాడు.
Virat Kohli Chant Om Namah Shivay Against Australia: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ సీక్రెట్స్లో ఒకటి రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో పదే పదే ఆ మంత్రాన్ని తలచుకుంటానని చెప్పాడు.
Nidhan
ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో అలవాటు ఉంటుంది. తమకు ఏది అచ్చొస్తే దాన్ని అనుసరిస్తుంటారు. బ్యాటర్లు అయితే గ్లౌవ్స్, ప్యాడ్స్ కట్టుకోవడంలో సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. దేవుళ్లను ఆరాధించే విషయంలోనూ వాళ్లలో ఇలాంటి నమ్మకాలను గమనించొచ్చు. కొందరు ఆటగాళ్లు తాము కొలిచే భగవంతుడి ఫొటోలకు దండం పెట్టాకే ఆడేందుకు వెళ్తారు. కీలక మ్యాచ్‌లకు ముందు కొన్ని ఆలయాలను సందర్శించడం ఇంకొందరు ప్లేయర్లకు అలవాటు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా ఓ సెంటిమెంట్ ఉందట. అతడి బ్యాటింగ్ సక్సెస్ సీక్రెట్స్లో ఒకదాన్ని అతడు తాజాగా రివీల్ చేశాడు. తాను ఆడే సమయంలో ప్రతి డెలివరీకి ముందు ఓ మంత్రాన్ని తలచుకుంటానని తెలిపాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఆడేస్తానని అన్నాడు. కోహ్లీ జపించే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో కలసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు కోహ్లీ. ఇందులో ప్రత్యేకంగా యాంకర్స్ ఎవరూ పాల్గొనలేదు. గౌతీ, కోహ్లీ ఇద్దరూ క్రికెట్‌తో పాటు పర్సనల్ కెరీర్ గురించి ఒకర్నొకరు ప్రశ్నించుకుంటూ, వాటికి సమాధానాలు చెబుతూ కనిపించారు. ఈ సందర్భంగానే నీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? బ్యాటింగ్ చేసే టైమ్‌లో దేన్నయినా ఫాలో అవుతావా? అంటూ గంభీర్ అడిగాడు. దీనికి స్పందించిన కోహ్లీ.. బ్యాటింగ్ సమయంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తానని తెలిపాడు. కఠిన సమయాల్లో దీన్ని ఎక్కువగా తలచుకుంటానని చెప్పాడు. 2014-15లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు ఈ మంత్రాన్ని అధికంగా ఉపయోగించానన్నాడు విరాట్.
2014లో ఆసీస్ టూర్లో ప్రతి డెలివరీకి ముందు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించానన్నాడు కోహ్లీ. దీంతో కోచ్ గంభీర్ కూడా ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. తాను ‘హనుమాన్ చాలీసా’ ఎక్కువగా వింటానని తెలిపాడు. 2009లో నేపియర్ టెస్ట్ ఆడుతున్న టైమ్‌లో వరుసగా రెండున్నర రోజుల పాటు ‘హనుమాన్ చాలీసా’ విన్నానని గౌతీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్, కెప్టెన్సీ గురించి కూడా కొత్త కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్‌లో ఇంకా పరుగుల దాహం తీరలేదని.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాలనే ఆకలి అతడిలో ఇంకా ఉందన్నాడు. ఏళ్ల పాటు ఒకే రీతిలో ఆడుతూ కొత్త తరానికి కోహ్లీ స్ఫూర్తిగా నిలిచాడని.. అతడి లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యంగ్ జనరేషన్ మీద ఉందన్నాడు గంభీర్. బ్యాటర్‌గానే గాక అగ్రెసివ్ కెప్టెన్‌గా భారత క్రికెట్‌పై కింగ్ వేసిన ముద్ర చెరపలేనిదని.. అది అందరు ఆటగాళ్లకు ఆదర్శమని మెచ్చుకున్నాడు.
Virat Kohli kept chanting ‘Om Namah Shivay’ before each delivery during the 2014-15 Australian tour.
Gautam Gambhir kept listening to ‘Hanuman Chalisa’ for two and a half days in Napier, 2009. pic.twitter.com/cCt4yAy0M5
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2024