SNP
టీమిండియా సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరమై.. తన ఇంటికే పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సిన ఆటగాడు.. ఎందుకు ఇంటికి వెళ్లాడనే విషయంపై క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతని సోదరుడు ఎమోషనల్‌పోస్ట్ చేశాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరమై.. తన ఇంటికే పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సిన ఆటగాడు.. ఎందుకు ఇంటికి వెళ్లాడనే విషయంపై క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతని సోదరుడు ఎమోషనల్‌పోస్ట్ చేశాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. తొలి టెస్టు జరిగిన హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత.. హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో కోహ్లీ రెండు టెస్టులకు దూరం అయ్యాడనే విషయం తెలిసిందే. ఈ విషయం క్రికెట్ అభిమానులను ఎంతో షాక్‌కు గురిచేసింది. అసలు కోహ్లీ ఇంత ఉన్నపళంగా ఎందుకు జట్టుకు దూరమై.. ఇంటికి వెళ్తున్నాడనే విషయం ఎవరికి అర్థం కాలేదు. దీంతో చాలా మంది తమకు తోచిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ కారణంతోనే కోహ్లీ ఇంటికి వెళ్లాడని చాలా మంది పలు వ్యాఖ్యలు చేశారు.
అయితే.. అన్నింటి కంటే విరాట్ కోహ్లీ తల్లి ఆరోగ్యం బాగా లేదని, అందుకే కోహ్లీ హుటాహుటిన ఇంటికి వెళ్లాడనే విషయం బాగా వైరల్ అయింది. అయితే.. ఈ విషయంపై తాజాగా కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పెడుతూ.. తన తల్లి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్త ప్రచారం అవుతుందని, కానీ, తన తల్లి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ పేర్కొన్నాడు. అలాగే.. మీడియా వారు.. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి అంటూ హితవు పలికాడు.
కాగా, ప్రస్తుతం కోహ్లీ ఎందుకు టీమ్ వీడాడనే కారణం తెలిస్తే కానీ, ఇలాంటి ఫేక్ వార్తలు ఆగేలా లేవు. అయితే.. ఈ విషయంపై అటు కోహ్లీ కానీ, ఇటు టీమిండియా కానీ, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫేక్ న్యూస్‌లు పుట్టుకుస్తున్నాయి. తాజాగా కోహ్లీ ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడనే విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ సరైన సమాచారం లేకుండా కీలకమైన సిరీస్ నుంచి హఠాత్తుగా వెళ్లిపోతే.. కచ్చితంగా క్రికెట్ లోకం అసలు ఏమైందే విషయం గురించి ఆరా తీస్తుంది. ఈ క్రమంలోనే ఫేక్ వార్తలు కూడా పుట్టుకొస్తాయి. మరి కోహ్లీ తల్లి ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ వార్తలతో పాటు, కోహ్లీ సోదరుడి పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli’s brother post on fake news circulating around their mother’s health. pic.twitter.com/IFLAsvNRa1
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2024