షాకింగ్ న్యూస్.. కోహ్లీ దంపతులు ఇండియాను వదిలి వెళ్లనున్నారా?

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఇండియాను వదిలి యూకేలో సెటిల్ అవ్వబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి. మరి నిజంగానే కోహ్లీ ఫ్యామిలీ భారత్ ను వీడుతుందా? అసలు ఈ న్యూస్ వైరల్ గా మారాడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఇండియాను వదిలి యూకేలో సెటిల్ అవ్వబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి. మరి నిజంగానే కోహ్లీ ఫ్యామిలీ భారత్ ను వీడుతుందా? అసలు ఈ న్యూస్ వైరల్ గా మారాడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.. దాదాపు రెండు నెలల తర్వాత లండన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు విరాట్. ఇటీవలే అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక అతడి పేరు అకాయ్ గా నామకరణం కూడా చేశారు. ఇక ఇండియా రాగానే ఐపీఎల్ కోసం ఆర్సీబీ టీమ్ లో చేరి.. ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. ఇంతవరకు కోహ్లీ ఫ్యాన్స్ హ్యాపీనే. కానీ ఇప్పుడు చెప్పబోయే న్యూస్ విరాట్ ఫ్యాన్స్ కు కాస్త ఆందోళన కలిగించేదే. అదేంటంటే? విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా ఇండియాను వీడిపోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఇండియాను వదిలి యూకేలో సెటిల్ అవ్వబోతున్నారన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు కొన్ని వెబ్ సైట్స్ లో నెటిజన్లు చర్చించుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెడిట్ లో..”విరాట్ కోహ్లీ క్రికెట్ కు దూరమై పర్మినెంట్ గా యూకేలో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ ఐపీఎల్ కోసం భారత్ కు వచ్చాడు. కానీ అతడి కుటుంబం ఇంకా లండన్ లోనే ఉంది. దీన్ని బట్టి చూస్తే.. అతడు అక్కడికే షిప్ట్ అవుతాడనిపిస్తుంది. పైగా చాలాసార్లు కోహ్లీ తనకు యూకే అంటే ఇష్టమని చెప్పాడు. అక్కడ సెలబ్రిటీలా కాకుండా.. సాధారణ పౌరునిగా జీవించవచ్చని, తన పిల్లల కోసం కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. నిజానికి రిచ్ పీపులు యూకేలో పీస్ ఫుల్ లైఫ్ గడపొచ్చు” అంటూ రెడిట్ లో నెటిజన్ల మధ్య సంభాషణ జరిగింది.

ఈ సంభాషణ ఆధారణంగా చేసుకునే చాలా మంది కోహ్లీ ఫ్యామిలీతో పాటుగా లండన్ కు వెళ్తాడని చెప్పుకొస్తున్నారు. కాగా.. ఈ వార్తలను విరాట్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఇండియా అంటే ఎంతో ప్రేమున్న కోహ్లీ దేశాన్ని వదిలి వెళ్లడని గట్టిగా వాదిస్తున్నారు. ఇలాంటి చౌకబారు ముచ్చట్లు చెప్పకండని వారికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కేవలం ఎవరో చేసిన కామెంట్స్ ను చూసి ఇలాంటి నిర్ణయానికి రావడం సమంజసం కాదని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. లక్నోకు భారీ గుడ్ న్యూస్! రాహుల్ కు NCA గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్

Show comments