P Venkatesh
IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లను పడగొట్టిన బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లను పడగొట్టిన బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
P Venkatesh
విశాఖ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టుకు షాకిస్తున్నాడు. కీలక ఆటగాళ్ల వికెట్లను పడగొట్టి అదరహో అనిపిస్తున్నాడు భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లను పడగొట్టి మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు బుమ్రా. తన అద్భుతమైన బౌలింగ్ తో బుమ్రా సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్‌గా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ లో బుమ్రా 15 ఓవర్లు వేసి 44 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మెయిడిన్ ఓవర్లు 5 ఉన్నాయి. దీంతో టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. కళ్లు చెదిరే బౌలింగ్ తో బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఓలి పోప్, జోరూట్, బెయిర్ స్టో, స్టోక్స్, హర్ట్లీ వంటి దిగ్గజ ప్లేయర్లను పెవిలియన్ కు పంపించి బుమ్రా ఇంగ్లాండ్ ను గజగజ వణికిస్తున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 396 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. ఇక లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 253 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 143 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. ఇక ఫస్ట్ టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ పరాజయంపాలైన విషయం తెలిసిందే.
Jasprit Bumrah becomes the fastest Indian pacer to take 150 Test wickets.
– Boom is unbelievable…!!! 🤯 pic.twitter.com/K0uPltroea
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2024