Jasprit Bumrah: బుమ్రాపై ప్రశంసలు.. బంగ్లా ప్లేయర్లపై సెటైర్లు! తమీమ్ ఇక్బాల్ షాకింగ్ కామెంట్స్..

Tamim Iqbal praises Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తూ.. బంగ్లాదేశ్ ప్లేయర్లపై సెటైర్లు వేశాడు ఆ దేశ మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Tamim Iqbal praises Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తూ.. బంగ్లాదేశ్ ప్లేయర్లపై సెటైర్లు వేశాడు ఆ దేశ మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు భారత్ ఆలౌట్ కాగా.. బంగ్లా కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. ఇక ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దాంతో 308 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మూడోరోజు మెుత్తం బ్యాటింగ్ చేస్తే.. ఆధిక్యం 500 రన్స్ ఈజీగా దాటుతుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ మాజీ స్టార్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్. అలాగే ఇన్ డైరెక్ట్ గా బంగ్లా ప్లేయర్లపై సెటైర్లు కూడా వేశాడు.

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో సత్తా చాటాడు.  బంగ్లా 149 రన్స్ కే కుప్పకూలడంలో బుమ్రాది కీలక పాత్ర. దాంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్. అలాగే తమ ఆటగాళ్లపై వ్యంగస్త్రాలు సంధించాడు. “భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దగ్గర అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అలాగే అతడికి గొప్ప మెదడు కూడా ఉంది. దాంతో తన స్కిల్స్ ను ఉపయోగిస్తూ.. ప్రపంచ స్థాయి బౌలర్ గా ఎదిగాడు. కానీ.. మీకు సూపర్ స్కిల్స్ ఉన్నప్పటికీ.. మీకు బుమ్రాలా గొప్ప బ్రెయిన్ లేకపోతే.. అతడిలా విజయవంతం కాలేరు. ప్రస్తుతం ప్రపంచం మెుత్తం ఇదే గమనిస్తోంది” అంటూ కామెంట్స్ చేశాడు తమీమ్ ఇక్బాల్.

కాగా.. ప్రస్తుతం ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బంగ్లా జట్టులో జరిగిన కొన్ని గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఇక్బాల్ తన కెరీర్ కు 2003లో వీడ్కోలు పలికాడు. ఆ కారణంతోనే అతడు ఇలా సొంత జట్టు ఆటగాళ్లపై సెటైర్లు వేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బంగ్లా క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. దానికి తగ్గట్లు బ్రెయిన్ వాడకపోతే.. విజయం సాధించలేరని తమీమ్ అభిప్రాయపడ్డాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 రన్స్, బంగ్లా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 149 రన్స్ చేశాయి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా రెండో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. క్రీజ్ లో రిషబ్ పంత్(12), శుబ్ మన్ గిల్(33) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ కు 308 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Show comments