Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.

టీ20 వరల్డ్ కప్-2024 ఇంకో నాల్రోజుల్లో మొదలవనుంది. ఇప్పటికే మెగా టోర్నీ కోసం అన్ని జట్లు కూడా యూఎస్​కు చేరుకున్నాయి. ఆటగాళ్లందరూ నెట్స్​లో చెమటోడుస్తున్నారు. కొన్ని టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్​లు కూడా ఆడేశాయి. ఫేవరెట్స్​లో ఒకటైన టీమిండియా కూడా అగ్రరాజ్యానికి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా జట్టు ఆటగాళ్లందరూ క్రికెట్ ప్రాక్టీస్​తో పాటు ఫుల్​బాల్, వాలీబాల్ ఆడుతూ ఫిట్​నెస్​ను మరింత మెరుగుపర్చుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ మిస్సయ్యాం.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టి కప్పును చేజార్చుకోవద్దనే కసితో సన్నద్ధం అవుతున్నారు. హిట్​మ్యాన్​ సహచరులతో కలసి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి ఎలాంటి తప్పుకు అవకాశం ఇవ్వకుండా.. టైటిల్ కొట్టాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.

ఫస్ట్ మ్యాచ్​ కోసం టీమిండియా ప్రిపేర్ అవుతోంది. ఆటగాళ్లందరిలో మెగా టోర్నీలో ఆడుతున్నామనే జోష్ కనిపిస్తోంది. అయితే మిగతా వాళ్లందరి కంటే కెప్టెన్ రోహిత్​కు ఇది చాలా స్పెషల్ టోర్నీగా మిగిలిపోనుంది. దీనికి కారణం అతడికి ఇది 9వ టీ20 ప్రపంచ కప్ కావడమే. రికార్డులకు కేరాఫ్ అడ్రస్​గా మారిన హిట్​మ్యాన్​ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్​లో నిర్వహించిన ప్రతి వరల్డ్ కప్​లోనూ ఆడిన ప్లేయర్​గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అతడితో పాటు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ కూడా ఈ ఫీట్​ను అందుకున్నాడు. 2007 నుంచి ఇప్పటిదాకా జరిగిన 8 టీ20 ప్రపంచ కప్​ల్లో వీళ్లిద్దరూ ఆడుతూ వచ్చారు. యూఎస్​ఏ ఆతిథ్యం ఇస్తున్న తాజా టోర్నీ వీళ్లకు తొమ్మిదోది కానుంది.

ఆరంభ టోర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి టీ20 వరల్డ్ కప్​లో ఆడిన ప్లేయర్లుగా రోహిత్, షకీబ్ నిలిచారు. ఈ టోర్నీ వీళ్లకు స్పెషల్​గా నిలిచిపోనుంది. వీళ్లిద్దరి రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కనీసం దశాబ్దంన్నర కన్​సిస్టెంట్​గా ఆడుతూ రన్స్ చేస్తే తప్ప టీమ్​లో కొనసాగలేరు. అందునా తీవ్ర పోటీ ఉండే వరల్డ్ కప్ టీమ్​లో చోటు దక్కాలంటే ఆ ప్లేయర్​ నిలకడకు మారుపేరుగా, టీమ్​కు వెన్నెముకగా ఉండాలి. భవిష్యత్తులో వీళ్ల రికార్డును ఇంకెవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి. రోహిత్ క్రేజీ రికార్డుపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. హిట్​మ్యాన్​ పరుగుల వరద పారించడంతో పాటు అద్భుతమైన కెప్టెన్సీతో టీమ్​కు కప్పు అందించాలని కోరుతున్నారు. టైటిల్ అందించి టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని చెబుతున్నారు.

Show comments