Nidhan
ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. దీంతో టీ20 వరల్డ్ కప్‌లోనూ అతడు ఇదే స్థాయిలో చెలరేగాలని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. దీంతో టీ20 వరల్డ్ కప్‌లోనూ అతడు ఇదే స్థాయిలో చెలరేగాలని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు.
Nidhan
ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడతను. ఈ సీజన్ గ్రూప్ స్టేజ్‌లో అతడు దారుణంగా ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోగా, భారీగా పరుగులు కూడా ఇచ్చుకుంటూ టీమ్‌కు భారం అయ్యాడు. అయినా మెంటార్ గౌతం గంభీర్ అతడిపై నమ్మకం ఉంచాడు. రూ.25 కోట్ల ఆటగాడు ఇలాగేనా ఆడేది అంటూ విమర్శలు రావడంతో స్టార్క్ కసిగా ఆడటం మొదలుపెట్టాడు. లీగ్ సెకండాఫ్‌లో ఫామ్‌లోకి వచ్చిన ఈ కంగారూ పేసర్.. ప్లేఆఫ్స్ దశలో డేంజరస్‌గా మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో 3 వికెట్లు, అదే జట్టు మీద ఫైనల్లో 2 వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచుల్లో కేకేఆర్ విజయంలో స్టార్క్‌దే కీలక పాత్ర.
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్-2024 మీద అతడు ఫోకస్ పెట్టాడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ పొట్టి కప్పును ఆస్ట్రేలియాకు అందించాలని చూస్తున్నాడు. కంగారూ ఫ్యాన్స్ కూడా అతడి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. స్టార్క్ రాణిస్తే తమకు తిరుగుండదని భావిస్తున్నారు. జట్టుకు అతడే కొండంత బలం అని అంటున్నారు. అయితే ఆసీస్ స్టార్ క్రికెటర్ టిమ్ పైన్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అయ్యాడు. స్టార్క్ జట్టుకు బలం కాదు.. పెద్ద బలహీనత అని అన్నాడు. అతడి వల్ల ఆసీస్‌కు తీవ్ర నష్టమని చెప్పాడు. సూపర్బ్ ఫామ్‌లో ఉన్న స్టార్క్‌ను ఉద్దేశించి పైన్ ఎందుకిలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏళ్ల కొద్దీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను కొనసాగిస్తూ స్టార్క్ ఈ తరంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడని టిమ్ పైన్ మెచ్చుకున్నాడు. అయితే ఏటికేడు బౌలింగ్ స్టాండర్డ్స్‌ను పెంచుతూ తనకు తానే శత్రువుగా మారాడని అభిప్రాయపడ్డాడు. స్టార్క్ బరిలోకి అడుగుపెట్టిన ప్రతిసారి అతడి నుంచి అభిమానులు అద్భుతాలు ఆశిస్తున్నారని.. కానీ ప్రతిసారి ఒకేలా రాణించడం ఎవరి వల్లా కాదన్నాడు పైన్. తన మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకునేందుకు స్టార్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని.. ఈ క్రమంలో కొన్నిసార్లు సక్సెస్.. మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతున్నాడని పేర్కొన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం ఆసీస్‌కు అతడు పెద్ద ఆయుధంగా మారనున్నాడని చెప్పుకొచ్చాడు. మరి.. స్టార్క్ వల్ల ఆసీస్‌కు నష్టమేనంటూ పైన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tim Paine ” Mitchell Starc is a victim of his own really high standards.People expect absolute brilliance from him everytime he walks on to the field.And more often than not,he has produced.He is gonna be a huge weapon in this coming World Cup again.”pic.twitter.com/9j6MPXJJ90
— Sujeet Suman (@sujeetsuman1991) May 30, 2024