Rohit Sharma: రోహిత్ శర్మకు వార్నింగ్ ఇచ్చిన రైనా, హర్భజన్! ఎందుకంటే?

IND vs BAN, Suresh Raina, Harbhajan Singh advise To Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లు హెచ్చరించారు. మరి ఏ విషయంలో వాళ్లిద్దరు రోహిత్ కు వార్నింగ్ ఇచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs BAN, Suresh Raina, Harbhajan Singh advise To Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లు హెచ్చరించారు. మరి ఏ విషయంలో వాళ్లిద్దరు రోహిత్ కు వార్నింగ్ ఇచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించారు భారత మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్. సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ లో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్థాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాను హెచ్చరించారు రైనా, భజ్జీ. వారిద్దరు ఏమన్నారంటే?

టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ లో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఇందుకోసం జట్టును ఎంపికచేసే పనిలో పడింది సెలక్షన్ కమిటీ. మరో వైపు పాకిస్థాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బంగ్ల సంచలన ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్ట్ లో పాక్ ను 10 వికెట్ల తేడాతో వారి గడ్డపైనే ఓడించి ప్రపంచ రికార్డును నమోదు చేసింది. పైగా గత కొంత కాలంగా బంగ్లాదేశ్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. కాబట్టి ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లు సున్నితంగా చెప్పి హెచ్చరించారు.

“బంగ్లాదేశ్ ను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పాక్ పై వారి ఆటతీరు చూస్తుంటేనే తెలుస్తోంది, వారు ఆటలో ఎంత పరిణతి చెందారో. ఆ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. వారు కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నారు. రోహిత్ బంగ్లాను ఈజీగా తీసుకోవద్దు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ భారత్ కు మంచి ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది” అని రైనా పేర్కొన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలను హర్భజన్ సింగ్ కూడా సమర్థించాడు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని భజ్జీ పేర్కొన్నాడు. కాగా.. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

Show comments