ICCని రూ.830 కోట్ల డిస్కౌంట్‌ కోరిన స్టార్‌ స్పోర్ట్స్‌! ఎందుకంటే..?

Star Sports, ICC: టీమిండియాతో పాటు మరికొన్ని జట్లు ఆడే ఐసీసీ ఈవెంట్స్‌ మ్యాచ్‌లు లైవ్‌ టెలికాస్ట్‌ చేసే ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ తమకు భారీ డిస్కౌంట్‌ ఇవ్వాలని కోరింది. అలా ఎందుకు కోరిందో ఇప్పుడు చూద్దాం..

Star Sports, ICC: టీమిండియాతో పాటు మరికొన్ని జట్లు ఆడే ఐసీసీ ఈవెంట్స్‌ మ్యాచ్‌లు లైవ్‌ టెలికాస్ట్‌ చేసే ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ తమకు భారీ డిస్కౌంట్‌ ఇవ్వాలని కోరింది. అలా ఎందుకు కోరిందో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఐసీసీకి ఒక రిక్వెస్ట్‌ చేసింది. తమకు ఏకంగా రూ.830 కోట్ల డిస్కౌంట్‌ ఇవ్వాలని కోరింది. తాజాగా ఐసీసీకి రాసిన లేఖలో స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ విషయాన్ని ప్రస్తావించింది. అదేంటి.. ఐసీసీని డిస్కౌంట్‌ ఇవ్వమని స్టార్‌ స్పోర్ట్స్‌ కోరడం ఏంటని కన్ఫ్యూజ్‌ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఐసీసీ టోర్నీల ప్రత్యక్ష ప్రసార హక్కుల కోసం స్టార్‌ స్పోర్ట్స్‌-ఐసీసీ మధ్య దాదాపు 3 బిలియన్‌ డాలర్ల డీల్‌ జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో ఈ డీల్‌ అమలులోకి వచ్చింది.

అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 అనుకున్నంత సక్సెస్‌ కాకపోవడంతో స్టార్‌స్పోర్ట్స్‌కు భారీ నష్టం వచ్చింది. స్టార్‌ స్పోర్ట్స్‌తో పాటు ఐసీసీకి కూడా నష్టం వాటిల్లింది. పైగా టీ20 వరల్డ్‌ కప్‌లో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. అందులో ఇండియా వర్సెస్‌ కెనడా మ్యాచ్‌, ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇలా మ్యాచ్‌లు రద్దు కావడంతో స్టార్‌స్పోర్ట్స్‌కు నష్టం వచ్చింది. అలాగే సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సైతం లో స్కోరింగ్‌ గేమ్‌గా మారడంతో కూడా నష్టానికి కారణమైంది. మొత్త​ం మ్యాచ్‌ జరిగితేనే కాదా.. యాడ్స్‌ పుష్కలంగా వేసుకొని ఆదాయం సమకూర్చుకునేది. కానీ, మ్యాచ్‌ త్వరగా ముగియడంతో స్టార్‌ స్పోర్ట్స్‌ నష్టపోయింది.

ఈ నష్టాల నుంచి తమను రక్షించేందుకు ఐసీసీ డీల్‌ నుంచి రూ.830 కోట్లు తమకు డిస్కౌంట్‌ ఇవ్వాలని కోరింది. ఇదే విషయాన్ని ఇటీవల శ్రీలంకలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో కూడా ప్రస్తావించినట్లు సమాచారం. నెక్ట్స్‌ ఐసీసీ ఛైర్మన్‌ రేసులో ఉన్న జైషా.. అంతా అనుకున్నట్లు ఐసీసీ ఛైర్మన్‌ అయితే.. తమకు మేలు జరుగుతుందని స్టార్‌ స్పోర్ట్స్‌ భావిస్తోంది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్‌ ట్రోఫీపై స్టార్‌ స్పోర్ట్స్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఆ టోర్నీ సూపర్‌ సక్సెస్‌ అయితే.. స్టార్‌ స్పోర్ట్స్‌ నష్టాల నుంచి బయటపడొచ్చు. మరి ఐసీసీని స్టార్‌ స్పోర్ట్స్‌ డిస్కౌండ్‌ కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments