స్టార్ క్రికెటర్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే..!

ఓ క్రికెటర్​ దారుణ హత్యకు గురవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని వెంటపడి మరీ కాల్చి చంపారు. ఎవరా ప్లేయర్? ఎందుకు అతడిపై దాడి జరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ క్రికెటర్​ దారుణ హత్యకు గురవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని వెంటపడి మరీ కాల్చి చంపారు. ఎవరా ప్లేయర్? ఎందుకు అతడిపై దాడి జరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ క్రికెటర్​ దారుణ హత్యకు గురవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని వెంటపడి మరీ కాల్చి చంపారు. ఎవరా ప్లేయర్? ఎందుకు అతడిపై దాడి చేశారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీలంక మాజీ క్రికెటర్, అండర్-19 టీమ్ మాజీ కెప్టెన్ ధమిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. అతడి ఇంట్లోకి చొరబడిన దుండగుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల నిరోషనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి చంపాడని తెలుస్తోంది.

ధమిక నిరోషన తన ఇంట్లో భార్య, పిల్లలతో ఉన్న టైమ్​లో ఇంట్లోకి చొరబడిన దుండగుడు వాళ్ల ముందే అతడ్ని కాల్చి చంపాడని తెలుస్తోంది. వదిలేయమని ప్రాథేయపడినా కనికరం చూపించలేదని సమాచారం. అయితే ఈ హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం హాస్పిటల్​కు తరలించారు. ఓ క్రికెటర్ ఇలా హత్యకు గురవడం లంకలో సంచలనంగా మారింది. అండర్-19 స్థాయిలో నేషనల్ టీమ్​కు కెప్టెన్​గా ఉన్న ధమిక.. ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగ లాంటి స్టార్ ప్లేయర్లతో కలసి ఆడాడు. అయితే 20 ఏళ్ల వయసులో అనూహ్యంగా క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు.

Show comments