135 ఏళ్ల కష్టం! 7 సార్లు విఫలం! దరిద్రాన్ని జయించిన సౌతాఫ్రికా కథ ఇది!

135 ఏళ్ల కష్టం! 7 సార్లు విఫలం! దరిద్రాన్ని జయించిన సౌతాఫ్రికా కథ ఇది!

South Africa, SA vs AFG, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌ చరిత్రలో తొలిసారి సౌతాఫ్రికా ఫైనల్స్‌ ఆడనుంది. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌తో వారికి పట్టిన దరిద్రం పోయినట్టే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అసలు వాళ్లకు ఉన్న దరిద్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..

South Africa, SA vs AFG, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌ చరిత్రలో తొలిసారి సౌతాఫ్రికా ఫైనల్స్‌ ఆడనుంది. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌తో వారికి పట్టిన దరిద్రం పోయినట్టే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అసలు వాళ్లకు ఉన్న దరిద్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సౌతాఫ్రికా కొత్త చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి.. ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్‌ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం నమోదు చేసింది. తొలుత ఆఫ్ఘాన్‌ను కేవలం 56 పరుగులకే కుప్పకూల్చిన సౌతాఫ్రికా.. 57 పరుగుల స్వల్ప టార్గెట్‌ను 8.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదిపారేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 5 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. హెండ్రిక్స్‌(29 నాటౌట్‌)తో కలిసి కెప్టెన్‌ ఎడెన్‌ మార్కరమ్‌ 23 పరుగులు చేసి.. మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ ఆడనుంది. 135 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న సౌతాఫ్రికా.. 1975 నుంచి మొదలైన వరల్డ్‌ కప్స్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరింది.

వన్డే, టీ20 అన్ని వరల్డ్‌ కప్స్‌ కలిపి ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఏకంగా 8 సెమీ ఫైనల్స్‌ ఆడింది. తొలిసారి 1992 వన్డే వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాలా ఈజీగా గెలవాలి. కానీ, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడం, డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఒక్క బాల్‌కు 23 పరుగులు చేయాల్సిన అసంభవమైన పరిస్థితి ఎదురుకావడంతో ప్రొటీస్‌ జట్టు ఆ వరల్డ్‌ కప్‌ నుంచి ఇంటి బాట పట్టింది. అక్కడి నుంచి సౌతాఫ్రికాను దరిద్రం పట్టుకుంది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అనేది ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది.

1999 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ టై కావడంతో ఆసీస్‌ ముందుకు వెళ్లింది. 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. 2009 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి పాలైంది. 2014 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఇండియాతో చేతిలో ఓడిపోయింది. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. ఇక చివరి వన్డే వరల్డ్‌ కప్‌ 2023 సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇలా సెమీ ఫైనల్‌ గండం దాటడంలో ఏకంగా ఏడు సార్లు విఫలమై.. ఇప్పుడు సక్సెస్‌ అయింది. 32 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. సెమీస్‌లో గెలిచి తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరి ఫైనల్‌ కూడా గెలిచి.. తొలి కప్పు అందుకుంటుందా? లేదా అనేది చూడాలి. ఆఫ్ఘాన్‌పై సెమీస్‌ విజయంతో సౌతాఫ్రికాకు పట్టిన దరిద్రం వదిలినట్టే అని వినిపిస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments