Shubman Gill: మ్యాచ్‌ గెలిచినా కెప్టెన్‌ గిల్‌కు తప్పని తిట్లు! ఉట్టి స్వార్థపరుడంటూ..!

Shubman Gill, Abhishek Sharma, IND vs ZIM: జింబాబ్వే టూర్‌లో ఇండియాను విజయవంతంగా నడిపిస్తున్న యువ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను స్వార్థపరుడంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill, Abhishek Sharma, IND vs ZIM: జింబాబ్వే టూర్‌లో ఇండియాను విజయవంతంగా నడిపిస్తున్న యువ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను స్వార్థపరుడంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేను 23 పరుగుల తేడాతో ఓడించి.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత యువ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 66 పరుగులతో టాప్‌ టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు అయినా కూడా గిల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని స్వార్థం వల్ల ఓ యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని క్రికెట్‌ అభిమానులు గిల్‌ను పొట్టుపొట్టు తిడుతున్నారు. బ్యాటర్‌గా హాఫ్‌ సెంచరీతో రాణించినా.. కెప్టెన్‌గా టీమ్‌ను విజయవంతంగా నడిపిస్తున్నా.. గిల్‌పై ఎందుకు విమర్శలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో శుబ్‌మన్‌ గిల్‌తో అభిషేక్‌ శర్మ ఓపెనర్‌గా దిగాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయి నిరాశపర్చినా.. రెండో మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే.. మూడో టీ20కి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ప్లేయర్లు యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, శివమ్‌ దూబే టీమ్‌లోకి వచ్చారు. దీంతో.. అభిషేక్‌ శర్మను వన్‌డౌన్‌లో ఆడించి.. జైస్వాల్‌తో కలిసి శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా ఆడాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్లేయర్‌ను నెక్ట్స్‌ మ్యాచ్‌కి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందికి దించడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పైగా శుబ్‌మన్‌ గిల్‌ 66 పరుగుల చేసినా.. 49 బంతులు తీసుకున్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ విఫలం అయ్యాడు. 9 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఓపెనర్‌గా ఆడి ఉంటే.. పవర్‌ ప్లే రిస్టిక్షన్స్‌ను ఉపయోగించుకుని రాణించే వాడని, వన్‌డౌన్‌లో ఆడించడంతోనే అభిషేక్‌ శర్మ విఫలం అయ్యాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. జైస్వాల్‌తో అభిషేక్‌ శర్మను ఓపెనర్‌గా ఆడించి.. శుబ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో ఆడాల్సిందని అంటున్నారు. కానీ, కెప్టెన్‌ కావడంతో తన ప్లేస్‌ను సేఫ్‌గా ఉంచుకుని.. అభిషేక్‌ శర్మకు అన్యాయం చేశాడంటూ మండిపడుతున్నారు. మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా.. అభిషేక్‌ శర్మను ఓపెనర్‌గా ఆడించాలని క్రికెట్‌ అభిమానులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments