శ్రేయస్‌ అయ్యర్‌కు మరో షాక్‌! IPLకు దూరం.. ఎందుకంటే?

Shreyas Iyer: ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సారి ఐపీఎల్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. టీమిండియాలో చోటు, బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన అయ్యర్‌కు ఇది దెబ్బమీద దెబ్బ.. అతను ఎందుకు దూరం కాబోతున్నాడో ఇప్పుడ తెలుసుకుందాం..

Shreyas Iyer: ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సారి ఐపీఎల్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. టీమిండియాలో చోటు, బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన అయ్యర్‌కు ఇది దెబ్బమీద దెబ్బ.. అతను ఎందుకు దూరం కాబోతున్నాడో ఇప్పుడ తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టైమ్‌ అస్సలు బాలేనట్టు ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్‌పై ప్రశంసల వర్షం కురిసింది. కానీ, అంతలోనే అతను ఏకంగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయే స్థాయికి దిగజారిపోయాడు. ఈ నాలుగు ఐదు నెలల కాలంలో పాపం అయ్యర్‌కు ఏం కలిసి రాలేదు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల టీ20 సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఆ రెండు టెస్టుల్లోనూ విఫలం అవ్వడంతో టీమ్‌లో చోటు కోల్పోయాడు.

జాతీయ జట్టులో చోటు కోల్పోవడంతో తిరిగి టీమ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించకుండా.. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం వెయిట్‌ చేస్తూ రెస్ట్‌ తీసుకుందాం అనుకున్నాడు. కానీ, బీసీసీఐ, అలాగే టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతన్ని దేశవాళి క్రికెట్‌లో ఆడాల్సిందిగా సూచించింది. అయితే తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని, దేశవాళి క్రికెట్‌లో ఆడలేనని బీసీసీఐకి చెప్పాడు. దాంతో.. బీసీసీఐ అతన్ని బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి రీహ్యాబ్‌ అవ్వాల్సిందిగా ఆదేశించింది. ఎన్‌సీఏలో చేసిన టెస్టుల్లో శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌గా ఉన్నాడంటూ రిపోర్ట్‌ వచ్చింది.

దేశవాళి క్రికెట్‌ ఆడకుండా సాకులు చెబుతున్నాడు అంటూ.. బీసీసీఐ అయ్యర్‌ను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగించింది. అతనితో పాటు ఇషాన్‌ కిషన్‌పై కూడా చర్యలు తీసుకుంది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు.. ఇద్దరు తర్వాత దేశవాళి క్రికెట్‌లో ఆడాడు. అయ్యర్‌ ముంబై తరఫున రంజీ ఫైనల్‌ ఆడుతున్నాడు. తాజాగా రంజీ ఫైనల్లో 95 పరుగులు చేసి రాణించాడు. అయితే.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు అయ్యర్‌ దూరం కానున్నట్లు సమాచారం. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్‌ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ గత సీజన్‌కు కూడా ఆడని విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments