రోడ్డు ప్రమాదానికి గురైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌! ఆటకు దూరం?

Sarfaraz Khan, Musheer Khan, Uttar Pradesh: సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

Sarfaraz Khan, Musheer Khan, Uttar Pradesh: సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

టీమిండియా క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ యాక్సిడెంట్‌ జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముషీర్‌ ఖాన్‌కు తీవ్ర గాయలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ముషీర్‌ ఖాన్‌తో అతని తండ్రి నౌషద్‌ ఖాన్‌ కూడా ఉన్నారు. ఇరానీ కప్‌ కోసం కోసం కాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలె జరిగిన దులీప్‌ ట్రోఫీలో ముషీర్‌ ఖాన్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అన్నతో పాటు అతను కూడా త్వరలోనే టీమిండియాకు ఆడతాడని అంతా భావించారు. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడు ముషీర్‌ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో అతని మెడకు ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం కారణంగా.. లక్నో వేదికగా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్‌కు ముషీర్‌ ఖాన్‌ దూరం కానున్నాడు. మొత్తంగా ఓ మూడు నెలల పాటు ముషీర్‌ క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఇరానీ కప్‌తో పాటు అక్టోబర్ 11 నుంచి జరిగే రంజీ ట్రోఫీ ప్రారంభ రౌండ్లకు కూడా దూరం కానున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ముషీర్‌.. అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇటీవల దులీప్‌ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున ఆడిన ముషీర్‌.. 181 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడి.. జట్టును ఆదుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌తో.. ఇండియన్‌ క్రికెట్ సర్కిల్‌లో ముషీర్‌ ఖాన్‌ పేరు మారుమోగిపోయింది. రంజీ ట్రోఫీ గత సీజన్‌లో ముంబై విజేతగా నిలవడంలో ముషీర్ కీ రోల్‌ ప్లే చేశాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అజేయంగా 203 పరుగులు సాధించాడు. విదర్భతో జరిగిన ఫైనల్‌లోనూ సెంచరీ (136)తో చెలరేగాడు. మరి ఇలా అద్భుతంగా ఆడుతూ.. టీమిండియాలో చోటే లక్ష్యంగా దూసుకెళ్తున్న ముషీర్‌ ఖాన్‌ యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments