Sanju Samson: దేశవాళీ క్రికెట్​లోనూ సంజూ ఫెయిల్.. ఇక ఎవరూ కాపాడలేరు!

Sanju Samson Flops In Duleep Trophy 2024: ఇంటర్నేషనల్ క్రికెట్​లో వచ్చిన అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకోలేదు సంజూ శాంసన్. అతడి తర్వాత వచ్చిన యంగ్​స్టర్స్ టీమ్​లో సెటిల్ అయిపోయారు. కానీ సంజూ మాత్రం ఇంకా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకు సెలెక్టర్లతో పాటు అతడి స్వయంకృతం కూడా ఉందని చెప్పక తప్పదు.

Sanju Samson Flops In Duleep Trophy 2024: ఇంటర్నేషనల్ క్రికెట్​లో వచ్చిన అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకోలేదు సంజూ శాంసన్. అతడి తర్వాత వచ్చిన యంగ్​స్టర్స్ టీమ్​లో సెటిల్ అయిపోయారు. కానీ సంజూ మాత్రం ఇంకా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకు సెలెక్టర్లతో పాటు అతడి స్వయంకృతం కూడా ఉందని చెప్పక తప్పదు.

కొందరు ఆటగాళ్లకు ఒక్క అవకాశం వచ్చినా చాలు.. తామేంటో నిరూపించుకొని టీమ్​లో సెటిల్ అయిపోతారు. మరికొందరికి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా యూజ్ ఉండదు. సంజూ శాంసన్​ను దీనికి ఎగ్జాంపుల్​గా చెప్పక తప్పదు. అతడు టాప్ స్టార్​గా ఎదగాల్సిన క్రికెటర్. ఎంతో టాలెంట్ ఉన్న బ్యాటర్. ఈ మాట ప్రస్తుత టీమిండియా కోచ్ గౌతం గంభీర్​తో పాటు మరికొందరు లెజెండరీ ఆటగాళ్లు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఎంత ప్రతిభ ఉన్నా సమయానికి దాన్ని బయటకు తీయకపోతే ఏం లాభం! సంజూ టైమ్ వచ్చినప్పుడు, తనకు ఛాన్స్ దొరికినప్పుడు మంచి ఇన్నింగ్స్​లు ఆడి ఉంటే ఇప్పుడు నెక్స్ట్ లెవల్​లో ఉండేవాడు. కానీ దురదృష్టం, స్వయంకృతం రెండూ కలసి ఎదగలేకపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోలేని సంజూ.. డొమెస్టిక్ క్రికెట్​లోనూ అదే రీతిలో ఆడుతూ నిరాశపరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో అతడు ఫెయిల్ అయ్యాడు.

ఇండియా-ఏతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్​లో సంజూ ఫెయిల్ అయ్యాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అకీబ్ ఖాన్ అనే కుర్ర బౌలర్​కు వికెట్ సమర్పించుకున్నాడు. ఒక బౌండరీ కొట్టిన సంజూ.. అదే ఊపులో భారీ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. అకీబ్ బౌలింగ్​లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సరైన ఛాన్సులు ఇవ్వడం లేదంటారని, ఇస్తే మాత్రం ఇలా ఫ్లాప్ అవుతాడంటూ నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి టోర్నీల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడి భారీ ఇన్నింగ్స్​లు ఆడితేనే కదా టీమిండియాలో చోటు దక్కుతుందని అంటున్నారు. మంచి ఛాన్స్ దొరికినప్పుడు ఫెయిలైతే ఎవరూ పట్టించుకోరని.. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదని చెబుతున్నారు.

ఇక, తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలో దొరికిన పలు అవకాశాలను వృథా చేసుకున్న సంజూ జట్టులో సెటిల్ కాలేకపోయాడు. అతడి తర్వాత వచ్చిన శుబ్​మన్ గిల్ లాంటి జూనియర్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్​గా ఎదిగాడు. టీమ్​కు వైస్ కెప్టెన్ కూడా అయిపోయాడు. కానీ శాంసన్ ఇంక టీమ్​లో చోటు దక్కించుకోవడానికే తంటాలు పడుతున్నాడు. అలాంటోడు డొమెస్టిక్ క్రికెట్​లో అయినా అదరగొడతాడేమో అనుకుంటే అక్కడా ఫెయిల్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో రాణిస్తే భారత టెస్ట్ టీమ్​లో బ్యాకప్ బ్యాటర్​గా తీసుకునేందుకు అవకాశం ఉంది. అయినా అతడు దాన్ని మిస్ చేసుకున్నాడు. మంచి ఇన్నింగ్స్​తో మెరవాల్సిన టైమ్​లో ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో అతడి ఇంటర్నేషనల్ కెరీరే కాదు.. డొమెస్టిక్ కెరీర్ కూడా ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాడు. సంజూ ఇక సర్దుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. దులీప్ ట్రోఫీలో సంజూ ఫ్లాప్ షోపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments