Nidhan
Rohit Sharma, Gautam Gambhir, IND vs BAN: రోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని అన్నారు. హిట్‌మ్యాన్‌ది దూకుడు.. కోచ్ గంభీర్ అయినా హెచ్చరించాలి కదా అని కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఓటమి తప్పదన్నారు. కానీ రోహిత్ సక్సెస్ చూసి తిట్టినోళ్లే పొగుడుతున్నారు.
Rohit Sharma, Gautam Gambhir, IND vs BAN: రోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని అన్నారు. హిట్‌మ్యాన్‌ది దూకుడు.. కోచ్ గంభీర్ అయినా హెచ్చరించాలి కదా అని కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఓటమి తప్పదన్నారు. కానీ రోహిత్ సక్సెస్ చూసి తిట్టినోళ్లే పొగుడుతున్నారు.
Nidhan
రోహిత్ శర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌కు భయపడుతున్నారంటూ విమర్శించారు. ఆ టీమ్‌కు భయపడి ఇంత రిస్క్ అవసరమా? మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. హిట్‌మ్యాన్ దూకుడుగా ఉన్నాడు సరే.. కోచ్ గౌతం గంభీర్ అయినా అతడికి సర్దిచెప్పాలి కదా.. ఓడిపోతే ఎవరు బాధ్యులని క్వశ్చన్ చేశారు. రోహిత్-గంభీర్ తప్పు చేస్తున్నారని.. ఇలాంటి పని ఎలా చేస్తారంటూ తిట్టారు. కానీ ఇప్పుడు అవే నోళ్లు ఆ ఇద్దర్నీ పొగుడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హిట్‌మ్యాన్‌ను ప్రశంసిస్తున్నాయి. అతడు చేసిన రిస్కే జట్టుకు భారీ విజయాన్ని అందించిందని మెచ్చుకుంటున్నాయి. అసలు ఏం జరిగింది? రోహిత్ ఏ విషయంలో తిట్లు తిన్నాడు? ఎందుకు అందరూ అతడ్ని ప్రశంసిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ మొదలవడానికి ముందు కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ కలసి ఓ వినూత్న ఆలోచన చేశారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నై వికెట్ స్వతహాగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. స్పిన్ అస్త్రంతో ఇక్కడ ఎన్నో మ్యాచుల్లో గెలిచిన ట్రాక్ రికార్డు భారత్‌కు ఉంది. కానీ రోహిత్-గౌతీ ద్వయం చెన్నై పిచ్‌ను పేస్ వికెట్‌గా మార్చాలని డిసైడ్ చేశారు. నల్ల మట్టికి బదులు ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయించారు. అయితే వాళ్లిద్దరూ అలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. టీమిండియా సొంతగడ్డపై ఆడే టెస్టు మ్యాచుల్లో దాదాపుగా స్పిన్ పిచ్‌లనే రూపొందిస్తారు. కానీ స్పిన్ వేయడంలోనూ, ఆడటంలోనూ బంగ్లాదేశ్ ఆరితేరింది. అలాగే ఇటీవల పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేయడంతో ఆ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో భారత బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. అటు బంగ్లా టీమ్‌లో మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉండటంతో చెన్నై పిచ్ విషయంలో గంభీర్-రోహిత్ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లారు.
సిరీస్‌లోని ఫస్ట్ మ్యాచ్‌లోనే స్పిన్ వికెట్ సిద్ధం చేస్తే బంగ్లాదేశ్ మరింత రెచ్చిపోయి ఆడే ప్రమాదం ఉంది. అందుకే చెపాక్ పిచ్‌ను పేస్ ఫ్రెండ్లీగా మార్చాడు రోహిత్. అదే టైమ్‌లో ఆ జట్టు ఇది స్పిన్ ట్రాక్ అనుకొని వస్తుంది. పేస్ వికెట్ అని తెలిశాక అడ్జస్ట్ అయి ఆడేలోపు వాళ్ల కథ ముగించొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ సాయిల్‌తో పిచ్ తయారు చేయించాడు. ఇది భలేగా వర్కౌట్ అయింది. మన బ్యాటర్లు దీనికి మొదటి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినా.. ఆ తర్వాత అలవాటు పడ్డారు. అశ్విన్‌తో పాటు గిల్, పంత్ సెంచరీలు బాదారు. జడేజా దాదాపుగా మూడంకెల స్కోరును టచ్ చేశాడు.
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్ 6 వికెట్లతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను కుప్పకూల్చారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్‌కు సపోర్ట్ లేకపోయినా వేరియేషన్స్‌తో ఆ జట్టు కథ ముగించాడు అశ్విన్. అంతా రాణించడంతో మెన్ ఇన్ బ్లూ 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. రోహిత్ పేస్ వికెట్ ఐడియా వర్కౌట్ అవడంతో అతడ్ని అంతా మెచ్చుకుంటున్నారు. అతడిది భయం కాదు.. డేరింగ్ అని, బంగ్లాను బుర్ర వాడి బోల్తా కొట్టించాడని అంటున్నారు. మన బ్యాటర్లు, బౌలర్ల టాలెంట్ మీద నమ్మకంతో అతడు ధైర్యం చేసి ఇలాంటి వికెట్ తయారు చేయించాడని చెబుతున్నారు. ప్లానింగ్ అంటే ఇది, రోహిత్ మామూలోడు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరి.. రోహిత్ పేస్ వికెట్ ఐడియా వర్కౌట్ అవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.