వరల్డ్ కప్ 2023లో ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమిండియాకు తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నాడు హిట్ మ్యాన్. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో తన మాస్టర్ ప్లాన్ తో కివీస్ ను చిత్తుచేశాడు.
వరల్డ్ కప్ 2023లో ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమిండియాకు తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నాడు హిట్ మ్యాన్. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో తన మాస్టర్ ప్లాన్ తో కివీస్ ను చిత్తుచేశాడు.
ఓ సారథిగా జట్టును ముందుండి నడిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. టీమ్ ను విజయవంతంగా నడిపిస్తూనే తన బ్యాటింగ్ లేదా బౌలింగ్ పై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఇది కత్తిమీదసాము లాంటి విషయమే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి బాధత్యను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దిగ్విజయంగా నిర్వహిస్తున్నాడు. వరల్డ్ కప్ 2023లో ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమిండియాకు తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నాడు హిట్ మ్యాన్. ఏ ఆటగాడిని ఎలా? ఏ టైమ్ లో ఉపయోగించుకోవాలనే విషయంలో రోహిత్ సిద్దహస్తుడనే చెప్పాలి. దానికి ఉదాహరణగా ఇండియా-కివీస్ మ్యాచే. డార్లీ మిచెట్, విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ భయపెట్టిన వేళ.. తన మాస్టర్ ప్లాన్ తో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
39/2.. 8 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్. కానీ ఆ తర్వాత కివీస్ పుంజుకున్న తీరు చూస్తే.. మ్యాచ్ టీమిండియా నుంచి చేజారుతుందా? అనుమానం కలిగింది. 32 ఓవర్లకు 220 రన్స్ చేసి విలియమ్సన్(69) వికెట్ కోల్పోయింది. అప్పటికే డార్లీ మిచెల్ క్రీజ్ లో చెలరేగిపోతున్నాడు. దీంతో మ్యాచ్ చూసే ప్రేక్షకుల్లో సైతం ఎక్కడో ఇసుమంత ఓటమి భయం నెలకొంది. కానీ ఆ భయాలన్నింటిని చీల్చుతూ.. తన మాస్టర్ ప్లాన్ తో గేమ్ ను మన చేతుల్లోకి తీసుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. తన అపార అనుభవాన్ని ఉపయోగించి బౌలర్లను, ఫీల్డర్లను పరిస్థితులకు అనుకూలంగా మార్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డార్లీ మిచెల్-విలియమ్సన్, మిచెల్-ఫిలిప్స్ భాగస్వామ్యాలు టీమిండియాను కలవరపెట్టాయి.
ఈ క్రమంలో రోహిత్ తన బుర్రకు పదునుపెట్టి బౌలర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చి.. ఫీల్డ్ సెటప్ ను కూడా అందుకు తగ్గట్లుగానే సెట్ చేశాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజాను మూడు ప్లేసుల్లోకి మార్చి ఫలితాన్ని రాబట్టాడు. అద్భతమైన క్యాచ్ లతో వరుసగా గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాంప్మన్ చివరిగా సెంచరీ హీరో డార్లీ మిచెల్ ను పెవిలియన్ కు పంపాడు. తమ బ్యాటింగ్ తో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలని చూసిన కివీస్ ను తన మాస్టర్ ప్లాన్ తో పడగొట్టాడు రోహిత్. ఇన్ని సంవత్సరాల తన కెప్టెన్సీ అనుభవాన్ని ఈ మ్యాచ్ ద్వారా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ కీలక వికెట్లు పడటంతో.. ప్రత్యర్థి ఒత్తిడికి లోనై మిగతా వికెట్లను ఈజీగా కోల్పోయింది. దీంతో టీమిండియా విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్లోకి హీరోగా అడుగుపెట్టింది. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీపై, అతడి నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravindra Jadeja after taking the catch. pic.twitter.com/Di13tZrah6
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023