Somesekhar
నువ్వు హీరోవి కాదంటూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆ వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
నువ్వు హీరోవి కాదంటూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆ వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
Somesekhar
ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను కైవసం చేసుకోవడానికి ఇండియా కేవలం 152 పరుగుల దూరంలో ఉంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది భారత్. అంతకు ముందు ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ చెలరేగడంతో.. కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో 192 పరుగుల టార్గెన్ ను భారత్ ముందు ఉంచినట్లైంది. ఇక ఈరోజు మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. ప్లేయర్లు ఏదైనా తప్పుచేస్తే.. తన నోటికి పనిచెబుతాడు ఈ కెప్టెన్. గతంలో ఎంతో మందిపై నోరుపారుసుకున్న సంఘటనలు మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఇంగ్లండ్ తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడోరోజు ఆటలో టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు హిట్ మ్యాన్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్ బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సర్ఫరాజ్ బ్యాటర్ కు మూడడుగుల దూరంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు.
అయితే ఈ సమయంలో అతడు హెల్మెట్ ధరించలేదు. ఇది గమనించిన రోహిత్..”సర్ఫరాజ్ నువ్వు హీరోవి కాదు.. వెంటనే హెల్మెట్ పెట్టుకో” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హెల్మెట్ తెప్పించుకుని పెట్టుకుని ఫీల్డింగ్ చేశాడు. సాధారణంగా టెస్టుల్లో స్పిన్ బౌలింగ్ వేసేటప్పుడు ఇలా హెల్మెట్ పెట్టుకుని బ్యాటర్ కు ఇరువైపులా ఫీల్డింగ్ చేయడం అన్నది మనందరికి తెలిసిందే. అయితే బ్యాట్స్ మెన్ భారీ షాట్ కొట్టినప్పుడు బాల్ తగిలే ప్రమాదం ఉండటంతో.. రోహిత్ బాధ్యతగా సర్ఫరాజ్ కు ఇలా స్వీట్ అండ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడోరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. మరో 152 రన్స్ చేస్తే.. టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది భారత్. మరి సర్ఫరాజ్ కు రోహిత్ మాస్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma to Sarfaraz Khan for not wearing helmet:
“Aye, hero nai banne ka (hey, don’t be a hero here)”. 🤣🤣pic.twitter.com/f49Mb60cmi
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
ఇదికూడా చదవండి: చెలరేగిన స్పిన్నర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం!