కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తున్న రోహిత్! ఇదేమి ఫీల్డ్ సెట్ చేయడం?

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన కెప్టెన్సీ స్టాండెడ్స్‌ ఏంటో మరోసారి నిరూపించే ఓ సంఘటన చోటు చేసుకుంది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన కెప్టెన్సీ స్టాండెడ్స్‌ ఏంటో మరోసారి నిరూపించే ఓ సంఘటన చోటు చేసుకుంది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా సూపర్‌ స్టార్ట్‌ అందుకుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ అయితే.. ఇంగ్లీష్‌ ‍బ్యాటింగ్‌ లైనప్‌ను చిందరవందర చేశాడు. క్రీజ్‌లో కుదరుకుని హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన బ్యాటర్‌ను కూడా తన అద్భుతమైన స్పిన్‌ మ్యాజిక్‌తో బోల్తా కొట్టించాడు కుల్దీప్‌. అతనికి తోడు వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ సైతం చెలరేగాడు. కుల్దీప్‌ 5, అశ్విన్‌ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ టాపు లేపారు. జడేజా ఒక వికెట్‌ తీశాడు. అయితే.. టీమిండియా ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోని యువ క్రికెటర్లకు ఫీల్డింగ్‌ పాఠాలు చెప్పాడు. ఫీల్డింగ్‌కి ఎలా నిల్చోవాలో.. ఎక్కడ నిల్చోవాలో కచ్చితంగా అక్కడ నిల్చోని మరి చూపిస్తూ.. వారిని లాక్కొచ్చి అక్కడ నిల్చోబెట్టాడు.

ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ ప్రారంభానికి ముందు.. షార్ట్‌ లెగ్‌లో నిల్చున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు కరెక్ట్‌ ప్లేస్‌లో నిల్చోమని చెప్పడమే కాకుండా.. సర్ఫరాజ్‌ను రెండు చేతులతో బలవంతంగా లాక్కొచ్చి మరీ కరెక్ట్‌ ప్లేస్‌లో ఫీల్డ్‌ సెట్‌ చేశాడు. వెంటనే ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను కూడా కాస్త ముందుకు జరిపి.. కాలితో లైన్‌ గీసి మరి అక్కడ నిల్చోబెట్టాడు. ఇలా ఇద్దరు యువ క్రికెటర్లను సరైన ప్లేస్‌లో ఫీల్డింగ్‌ పెట్టడమే కాకుండా.. అక్కడే ఎందుకు నిల్చోవాలో కూడా వాళ్లకు వివరించాడు. దీంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. కెప్టెన్‌ అలా ఇలా ఉండాలంటూ క్రికెట్‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి పిచ్‌ కండీషన్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న బెన్‌ స్టోక్స్‌కు టీమిండియా స్పిన్నర్లు ఊహించని షాకిచ్చారు. ఆ జట్టును కేవలం 218 పరుగులకే కుప్పకూల్చారు. చైనామెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగగా, అశ్విన్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే జడేజా ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జాక్‌ క్రాలే ఒక్కడే 79 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో ఇంగ్లండ్‌ త​క్కువ స్కోర్‌కే అవుటైంది. వందో టెస్ట్‌ ఆడుతున్న బెయిర్‌ స్టో 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేసి వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, అదే ఊపులో అవుట్‌ అయ్యాడు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ డకౌట్‌ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ యువ క్రికెటర్లను ఫీల్డింగ్‌లో సెట్‌ చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Show comments