Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు హీరో అయిపోయాడు. ఐపీఎల్-2024 టైమ్‌లో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన ఈ స్టార్ ప్లేయర్‌ను ఇప్పుడు అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు హీరో అయిపోయాడు. ఐపీఎల్-2024 టైమ్‌లో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన ఈ స్టార్ ప్లేయర్‌ను ఇప్పుడు అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ కైవసం చేసుకోవడంలో చాలా మంది పాత్ర ఉంది. ఇటు ఆటగాళ్లతో పాటు అటు కోచింగ్ స్టాఫ్ రోల్ కూడా ఉంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందంతో పాటు ఆటగాళ్లంతా కలసికట్టుగా రాణించడం వల్లే జట్టు 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పొట్టి కప్పును సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. సూపర్-8తో పాటు నాకౌట్ ఫైట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి టీమ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. టోర్నీ మొత్తం ఫెయిలైన విరాట్ కోహ్లీ తుదిపోరులో తన పవర్స్‌ను బయటకు తీసి రెచ్చిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబె అవకాశం దొరికినప్పుడల్లా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్ విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.
స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగంలోని అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కూడా చెలరేగిపోయారు. వీళ్లతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో తన అవసరం ఉన్న ప్రతిసారి అతడు ప్రామిసింగ్ పెర్ఫార్మెన్సెస్తో అలరించాడు. ఫైనల్లోనూ కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. టోర్నీలో అతడు రాణించిన తీరుతో అందరూ ఫిదా అయిపోయారు. ఇంత మంచి ప్లేయర్‌ను అనవసరంగా ట్రోల్ చేశామని చాలా మంది ఫీల్ అవుతున్నారు. రోహిత్ శర్మ అభిమానుల్లో చాలా మంది ఇదే ఫీలింగ్‌తో ఉన్నారు. అందుకే తాజాగా ఓ హిట్‌మ్యాన్ ఫ్యాన్ హార్దిక్‌కు సారీ చెప్పాడు.
పొట్టి కప్పును టీమిండియా అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాకు ఒక రోహిత్ శర్మ అభిమాని క్షమాపణలు చెప్పాడు. ‘భాయ్.. మమ్మల్ని క్షమించు’ అంటూ టీవీలో హార్దిక్ ఫొటోకు తిలకం దిద్ది, పూలదండ వేసి గుంజీలు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐపీఎల్-2024 సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా పాండ్యాపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడ్ని ట్రోల్ చేశారు. బూ.. అంటూ ఎగతాళి చేశారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా హార్దిక్ ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోయాడు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించడంతో ఇప్పుడు అందరితో పాటు రోహిత్ అభిమానులు కూడా అతడ్ని మెచ్చుకుంటున్నారు. మరి.. హార్దిక్‌కు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ సారీ చెప్పడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.