రీరిలీజ్ లో కొత్త ట్రెండ్…డే 1ఇన్ని కోట్ల !!

ఈ మధ్య కాలంలో రీరిలీజ్ లకు బాగా క్రేజ్ లభిస్తుంది. కొత్త సినిమాలకు పోటీగా రీరిలీజ్ లు కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో చిరు సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి రీరిలీజ్ కలెక్షన్స్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలేంటో చూసేద్దాం.

థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు వెళ్లడానికైనా ఆలోచిస్తారేమో.. కానీ రిరీలీజ్ కు మాత్రం అసలు మిస్ చేయకుండా వెళ్తున్నారు మూవీ లవర్స్. ఒక సినిమా ఎన్ని సార్లు రీరిలీజ్ అయినాసరే అసలు మిస్ చేయడం లేదు. మరి టాలీవుడ్ లో రీరిలీజ్ లు క్రియేట్ చేస్తున్న ట్రెండ్ అలాంటిది. ఈ క్రమంలో రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి , శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ 3డి వెర్షన్ లో రీరిలీజ్ చేశారు. ఈ సోషియో ఫాంటెసీ మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత కూడా రీరిలీజ్ లో అలాంటి హిస్టరీనే రిపీట్ చేసింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ అందరికి షాక్ ఇచ్చింది. ఫస్ట్ డే ఈ సినిమాకు రూ.1.75 ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇప్పుడు ఎలాగూ వీకెండ్ కాబట్టి ఈ మూవీ రిరీలీజ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయం అని అంటున్నారు మూవీ యూనిట్. ఇక మూవీ థియేట్రికల్ రన్ పూర్తయ్యేలోపు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments