OTT లో ఒకేరోజు 5 తెలుగు సినిమాలు ..అసలు మిస్ కాకండి

ఎంత థియేటర్ లో కొత్త సినిమాలు వస్తున్నాయని తెల్సిన కానీ.. ప్రేక్షకులంతా OTT కంటెంట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోను తెలుగు సినిమాలను జల్లెడ వేసి మరి చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఒకే రోజు 5 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో చూసేద్దాం.

ఎంత థియేటర్ లో కొత్త సినిమాలు వస్తున్నాయని తెల్సిన కానీ.. ప్రేక్షకులంతా OTT కంటెంట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోను తెలుగు సినిమాలను జల్లెడ వేసి మరి చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఒకే రోజు 5 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో చూసేద్దాం.

OTT కంటెంట్ కు రాను రాను డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దానికి తగినట్టే మేకర్స్ కూడా ప్రతి వారం స్పెషల్ మూవీస్ ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. లాంగ్వేజ్ బారియర్ లేకుండా కంటెంట్ ను బట్టి ప్రేక్షకులు ఏ సినిమాలనైనా ఆదరిస్తున్న మాట నిజమే. కానీ ఆయా సినిమాలు తెలుగులో వస్తున్నాయంటే మాత్రం అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఒకేరోజు ఏకంగా 5 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

గుడ్ బ్యాడ్ అగ్లీ :
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

జాక్ :
టిల్లు స్క్వైర్ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఇన్వెస్టిగేటివ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్ లో ఈ సినిమా మిస్ అయినవారు OTT లో ఓ లుక్ వేసేయండి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఓదెల 2 :
ఇది ఒక మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా . మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. హర్రర్ సినిమాలు ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దానికి మైథలాజి టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, హిందీ వంటి 3 భాషల్లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి :
నిత్యం బుల్లితెర మీద అందరిని అలరించే పక్కింటి అబ్బాయిల కనిపించే ప్రదీప్.. వెండితెర మీద ఎంట్రీ ఇచ్చేసాడు. ప్రదీప్ మాచిరాజు , దీపికా పిల్లి నటించిన మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ యాంకర్స్ ఇద్దరు నటించిన మూవీ థియేటర్ లో మిస్ అయితే మాత్రం కచ్చితంగా OTT లో ఓ లుక్ వేయాల్సిందే. ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

అపరాధి :
మలయాళీ సినిమాలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన ఇరుల్ అనే మూవీని తెలుగులో అపరాధి అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా రన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి ఈ హర్రర్ థ్రిల్లర్ ను అసలు మిస్ కాకుండా చూసేయండి.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments