జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ సంగతేమై ఉంటుంది!!

మెగాస్టార్ సినిమాలలో ఆల్ టైం ఫేవరేట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు అయింది. ఇక ఇప్పుడు మే 9 న ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ సిక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

మెగాస్టార్ సినిమాలలో ఆల్ టైం ఫేవరేట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు అయింది. ఇక ఇప్పుడు మే 9 న ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ సిక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో రీరిలీజ్ లకు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. అందులోను మెగాస్టార్ సినిమా 3 డి ఎఫెక్ట్ లో చూడడం అంటే ఇక ప్రేక్షకులకు కన్నుల పండగే. చాలా థియేటర్స్ లో ఈరోజు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా పుణ్యమా అని సందడి నెలకొంది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా సిక్వెల్ గురించి అంతటా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి సరైన సిక్వెల్ కు స్కోప్ ఉన్న మూవీ ఇది. ఈ మూవీ క్లైమాక్స్ లో కూడా సిక్వెల్ కు లీడ్ ఉంటుంది. అంతేకాకుండా అశ్విని దత్ కూడా ఈ సినిమా సిక్వెల్ చేయాలనీ ఎప్పటినుంచో అనుకునుటున్నాడట.

జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి శ్రీదేవి జంటను ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఇక ఇప్పుడు ఈ సిక్వెల్ లో వారి వారసులు రామ్ చరణ్ , జాన్వీ కపూర్ లు జంటగా చేస్తే బావుంటుందనే ఓ ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చూసినట్లయితే తెర వెనుక సిక్వెల్ కు సంబదించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ దీనికి సంబందించిన అఫీషియల్ న్యూస్ అయితే ఇంతవరకు బయటకు రాలేదు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి అటు చరణ్ ఇటు నాగ్ అశ్విన్ ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒకవేళ వినిపిస్తున్న కథనాల ప్రకారం నాగ్ అశ్విన్ కనుక ఈ సిక్వెల్ మీద సీరియస్ గా వర్క్ చేస్తే.. ఇక అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా మాటల దగ్గరే ఆగిపోతుందా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ముందుకు వెళ్తే కనుక జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 ఓ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఏమవుంతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments