OTT సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 లో మూడో ముద్దుగుమ్మ ఎంట్రీ..

OTT లకు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఓ సిరీస్ హిట్ అయిందంటే ఇక దానికి సిక్వెల్ ను కూడా దించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

OTT లకు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఓ సిరీస్ హిట్ అయిందంటే ఇక దానికి సిక్వెల్ ను కూడా దించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

ప్రేక్షకులు OTT లను ఎక్కువగా ఆదరించడంతో మేకర్స్ కూడా విభిన్నమైన కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇతర భాషల్లోనే ఈ OTT కంటెంట్ లు బాగా ట్రెండ్ అయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు , సిరీస్ లు వస్తున్నాయి. పైగా ఒకటి రెండు సిరీస్ లు బాగా ట్రెండ్ అయితే వాటికి సిక్వెల్స్ కూడా తీస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో 2021 లో గ్లామర్ బ్యూటీస్ పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన 3 రోజెస్ కు మంచి స్పందన లభించింది. దీనితో ఈ సిరీస్ కు సిక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. సిక్వెల్ అనౌన్స్ చేసినప్పటినుంచి కూడా ఎలాంటి కంటెంట్ ఉండబోతుందా అని ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ సిక్వెల్ కు సంబందించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మొదటి సీజన్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఈ సీజన్ లో కనిపించరు.

ఈషా రెబ్బా మాత్రమే పార్ట్ 2 లో కూడా కంటిన్యూ అయింది. ఇక రెండో హీరోయిన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కుషిత కల్లపు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మూడో హీరోయిన్ ను రివీల్ చేశారు మేకర్స్. 3 రోజెస్ 2 లో మూడో హీరోయిన్ హా రాసి సింగ్ నటించనుంది. తాజాగా ఆమె ఎంట్రీకి సంబందించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఈ గ్లిమ్ప్స్ లో మొదట రాసి సింగ్ ను సంప్రదాయంగా చూపించారు. ఆ తర్వాత గ్లామర్ గా చూపించి షాక్ ఇచ్చారు. ఇలా రెండు వేరియేషన్స్ తప్ రాసి సింగ్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్.

సో ఈ గ్లిమ్ప్స్ తో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ సిరీస్ మూవీ లవర్స్ ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. కానీ ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఎప్పుడో మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే మొదటి పార్ట్ ఆహలోనే స్ట్రీమింగ్ అయింది కాబట్టి.. రెండో సీజన్ కూడా అందులోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన మరిన్ని విషయాలు అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Show comments