వరల్డ్ కప్ సెమీఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. కివీస్ బౌలర్లను దంచికొడుతూ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు టీమిండియా సారథి.
వరల్డ్ కప్ సెమీఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. కివీస్ బౌలర్లను దంచికొడుతూ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు టీమిండియా సారథి.
రోహిత్ శర్మ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో పలు రికార్డులను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఈ హిట్ మ్యాన్.. తాజాగా మరో రికార్డు నెలకొల్పి హిస్టరీ క్రియేట్ చేశాడు. సెమీఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. కివీస్ బౌలర్లను దంచికొడుతూ టీమిండియా స్కోర్ ను రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు టీమిండియా సారథి. ఆ రికార్డు ఏంటంటే?
న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో తిరుగులేని సూపర్ ఫామ్ లో ఉన్న భారత జట్టు.. అదే స్పీడ్ ను కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లోనూ చూపిస్తూ దూసుకెళ్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో వారిపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే యునివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. గేల్ వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు. అతడు 34 ప్రపంచ కప్ ఇన్నింగ్స్ ల్లో 49 సిక్సు లు బాదాడు.
తాజాగా ఈ రికార్డులను బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ 47 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో ఇప్పటికే 4 సిక్సర్లు బాదాడు. దీంతో ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ రికార్డుతో పాటుగా పలు ఘనతలు కూడా సాధించాడు టీమిండియా సారథి. ఒకే వరల్డ్ ఎడిషన్ లో ఎక్కువ సిక్సర్లు (క్రిస్ గేల్ 26 సిక్సర్లు 2015 వరల్డ్ కప్) కొట్టిన ప్లేయర్ గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ లిస్ట్ లో వీరిద్దరి తర్వాత ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ 43 సిక్స్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మిస్టర్ 360 ప్లేయర్ డివిల్లియర్స్ 37 సిక్సులు బాది నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోయి 71 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ 21 బంతుల్లో 21 రన్స్ చేసి నిలకడగా ఆడుతున్నాడు. మరి రోహిత్ వరల్డ్ రికార్డు సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ROHIT SHARMA BECOMES THE FIRST PLAYER TO HIT 50 SIXES IN WORLD CUP HISTORY. pic.twitter.com/rxpJYuoVx1
— Johns. (@CricCrazyJohns) November 15, 2023