Nidhan
Riyan Parag, Duleep Trophy 2024, IND A vs IND D: టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది.
Riyan Parag, Duleep Trophy 2024, IND A vs IND D: టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది.
Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అంతే అగ్రెసివ్ అప్రోచ్‌తో ఆడుతుంటాడు పరాగ్. దులీప్ ట్రోఫీ-2024లో మరో మంచి నాక్ ఆడాడతను. ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన పరాగ్ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. క్రీజులో ఉన్నంత సేపు బాదుడే బాదుడు అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది. అతడు కొట్టిన ఓ షాట్ అయితే ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కావేరప్ప బౌలింగ్‌లో పరాగ్ స్టన్నింగ్ సిక్స్‌తో అలరించాడు.
5 ఓవర్లలో 2 వికెట్లు తీసి మంచి ఊపు మీదున్న కావేరప్పకు పరాగ్ షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. డీప్ కవర్ మీదుగా అతడు కొట్టిన సిక్స్ అద్భుతమనే చెప్పాలి. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతిని ముందే అంచనా వేసిన పరాగ్.. అది పడగానే దాన్ని పికప్ చేసుకున్నాడు. క్రీజులో నిల్చున్న చోటు నుంచే డీప్ కవర్స్ మీదుగా భారీ షాట్‌గా మలిచాడు. బాల్ వేగం, పరాగ్ టైమింగ్‌కు అది చాలా ఎత్తులో వెళ్లి దూరంగా పడింది. షాట్ కొట్టిన టైమ్‌లో పరాగ్ హెడ్, బాడీ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందుకే ఇంచు కూడా కదలకుండా ఉన్న చోటు నుంచి కొడితే ఎక్కడో స్టేడియం పైకప్పు మీద వెళ్లి పడింది బంతి. చక్కటి టైమింగ్‌తో షాట్‌ను పరాగ్ కనెక్ట్ చేసిన విధానం హైలైట్‌గా నిలిచింది.
మొత్తంగా 29 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 37 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ ఉంది. ఉన్నంత సేపు బిగ్ షాట్స్‌తో అలరించిన పరాగ్ ఔట్ అయ్యాక ఇండియా ఏ మరింత ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ, శాశ్వత్ రావత్ ఔట్ అయ్యారు. ఇండియా ఏ టీమ్ ప్రస్తుతం 31 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 115 పరుగులతో ఉంది. టాప్ బ్యాటర్స్ అంతా ఫెయిల్ అయ్యారు. పరాగ్ ఒక్కడే బాగా ఆడాడు. అతడు కూడా దొరికిన మంచిన స్టార్ట్‌ను అదే రీతిలో కంటిన్యూ చేస్తూ పోతే ఇండియా ఏకు భారీ స్కోరు ఆశలు ఉండేవి. కుమార్ కుశాగ్ర (19 నాటౌట్), షామ్స్ ములానీ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాని మీదే ఇండియా ఏ టీమ్ భారీ స్కోరు ఛాన్సెస్ డిపెండ్ అవుతాయి. మరి.. పరాగ్ క్లాసికల్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
WHAT A CRACKING SHOT FROM RIYAN PARAG. 😳🔥pic.twitter.com/5uZnn5MYff
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024