Rishabh Pant: వీడియో: రిషభ్‌ పంత్‌ చెత్త కీపింగ్‌! సింపుల్‌గా అవుట్‌ చేసే చోట..

Rishabh Pant: వీడియో: రిషభ్‌ పంత్‌ చెత్త కీపింగ్‌! సింపుల్‌గా అవుట్‌ చేసే చోట..

Rishabh Pant, IND vs SL, Cricket News: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్‌ ప్లేయర్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ చేసిన చెత్త స్టంపింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, IND vs SL, Cricket News: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్‌ ప్లేయర్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ చేసిన చెత్త స్టంపింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కేఎల్‌ రాహుల్‌ స్థానంలో శ్రీలంకతో మూడో వన్డే ఆడుతున్న రిషభ్‌ పంత్‌.. తన చెత్త వికెట్‌ కీపింగ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టి.. రిషభ్‌ పంత్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నాడు రోహిత్‌ శర్మ. ఈ వన్డే సిరీస్‌లో పంత్‌కు ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఆడే అవకాశం వచ్చింది. కానీ, వచ్చిన ఈ అవకాశంలో కూడా చెత్త వికెట్‌ కీపింగ్‌ చేశాడు పంత్‌. దీంతో.. అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ పంత్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో నాలుగో బంతికి కుసల్‌ మెండీస్‌ అవుట్‌ అయ్యాడు. ఇక అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన మహీష్‌ తీక్షణ ఆ ఓవర్‌ చివరి బంతికి ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్‌ను పూర్తి మిస్‌ అయ్యాడు. బాల్‌ వెళ్లి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడింది. అప్పటికే తీక్షణ క్రీజ్‌ నుంచి చాలా ముందుకు వచ్చేశాడు. అంతా కచ్చితం స్టంప్‌ అవుట్‌ అనుకున్నారు. కానీ, పంత్‌ చాలా నిదానంగా స్టంపింగ్‌ చేయడంతో తీక్షణ బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టేశాడు.

చాలా సులువుగా స్టంప్‌ అవుట్‌ చేయాల్సిన చోటు.. పంత్‌ నిదానంగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్‌ వికెట్‌ కీపర్‌గా అతను మెరుపు వేగంతో స్పందించాలి, కానీ అలా స్పందించలేదు. దీంతో.. కుల్దీప్‌తో పాటు టీమిండియాకు ఒక వికెట్‌ దక్కకుండా పోయింది. ఇక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంకా 45, అవిష్క ఫెర్నాండో 96, కుసల్‌ మెండిస్‌ 59 పరుగులుతో రాణించారు. భారత బౌలర్లలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ 3 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ స్టంపింగ్‌ మిస్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments