Rinku Singh: వీడియో: బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు!

Rinku Singh, UP T20 League 2024: యూపీ టీ20 లీగ్ 2024 లో రింకూ సింగ్ అదరగొడుతున్నాడు. ఎప్పుడూ బ్యాటింగ్ తో అదరగొట్టే రింకూ.. ఈసారి బౌలింగ్ లో సత్తాచాటుతున్నాడు. తాజాగా కన్ఫూర్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ వీడియో వైరల్ గా మారింది.

Rinku Singh, UP T20 League 2024: యూపీ టీ20 లీగ్ 2024 లో రింకూ సింగ్ అదరగొడుతున్నాడు. ఎప్పుడూ బ్యాటింగ్ తో అదరగొట్టే రింకూ.. ఈసారి బౌలింగ్ లో సత్తాచాటుతున్నాడు. తాజాగా కన్ఫూర్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ వీడియో వైరల్ గా మారింది.

రింకూ సింగ్.. ఇన్ని రోజులు తన మెరుపు బ్యాటింగ్ తో అలరించాడు. మిడిలార్డర్ లో వచ్చి బెస్ట్ ఫినిషర్ గా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తనలో ఉన్న బౌలింగ్ స్కిల్ ను కూడా బయటకి తీస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్ లో భాగంగా తాజాగా కన్పూర్ తో జరిగిన మ్యాచ్ లో రింకూ బంతితో చెలరేగాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

యూపీ టీ20 లీగ్ 2024 లో రింకూ సింగ్ మీరట్ మెవెరిక్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాడు రింకూ. ఇటీవలే నోయిడా సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ చేయడంతో పాటుగా 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపిస్తూ.. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది మీరట్ జట్టు. అయితే ఆటకు మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు. ఇక 9 ఓవర్లలో మెవెరిక్స్ టీమ్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాధవ్ కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన కాన్పూర్ టీమ్ కు డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ ను 106 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికిి 61 రన్స్ చేసి.. విజయం దిశగా సాగుతోంది. కానీ.. 6వ ఓవర్లో బంతిని అందుకున్నాడు కెప్టెన్ రింకూ సింగ్. రింకూ తన ఆఫ్ స్పిన్ తో ఈ ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. తొలుత శౌర్య సింగ్(5) నెక్ట్స్ ఆదర్శ్, సుంధాంశ్ లను పెవిలియన్ చేర్చాడు. దాంతో కన్ఫూర్ ఓటమి ఖరారు అయ్యింది. రింకూ దెబ్బకు 7.4 ఓవర్లలోనే కాన్ఫూర్ 83 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తో మీరట్ మెవెరిక్స్ టీమ్ సూపర్ విక్టరీని సాధించింది. మరి ఎప్పుడూ బ్యాట్ తో అదరగొట్టే రింకూ.. బౌలింగ్ లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments