Rinku Singh: KKR రిటైన్ చేసుకోకపోతే.. RCBకి ఆడాలనుకుంటున్నా: రింకు సింగ్

Rinku Singh: KKR రిటైన్ చేసుకోకపోతే.. RCBకి ఆడాలనుకుంటున్నా: రింకు సింగ్

కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ తనను ఒకవేళ రిటైన్ చేసుకోకపోతే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలనుందని ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా యంగ్ ఫినిషర్ రింకు సింగ్. ఆ వివరాల్లోకి వెళితే..

కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ తనను ఒకవేళ రిటైన్ చేసుకోకపోతే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలనుందని ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా యంగ్ ఫినిషర్ రింకు సింగ్. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2025.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. ఇక ఈ సీజన్ కు సంబంధించి కొన్ని రూల్స్ ను సవరించే పనిలో పడింది బీసీసీఐ. అందుకోసం ఫ్రాంచైజీల నుంచి సూచనలు, సవరణలను కోరింది. ఫ్రాంచైజీలు సైతం ఇటీవల ముగిసిన సమావేశంలో కొన్ని మార్పులను బీసీసీఐ ముందు ఉంచాయి. ఆటగాళ్లు సైతం ప్రస్తుతం ఆడుతున్న జట్లు తమను రిటైన్ చేసుకోకపోతే.. ఏ టీమ్స్ లోకి వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకు సింగ్ సైతం ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రింకు సింగ్.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి చిచ్చరపిడుగు. చివరి ఓవర్లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది జట్టును గెలిపించడంతో.. ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. దాంతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. జాతీయ టీమ్ లోకి వచ్చిన తర్వాత తనకు వచ్చిన ఛాన్స్ లను బాగానే ఉపయోగించుకున్నాడు. బ్యాట్ తో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేస్తూ.. జట్టులో బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఒకవేళ కోల్ కత్తా నైట్ రైడర్స్ నన్ను రిటైన్ చేసుకోకపోతే.. విరాట్ కోహ్లీ టీమ్ అయిన ఆర్సీబీకి ఆడాలనుంది” అని తన మనసులో మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం రింకు కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

కాగా.. ప్రస్తుతం బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఈ సీజన్ లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా? మీ సూచనలను, సలహాలను ఇవ్వాలని పేర్కొంది. ఫ్రాంచైజీలు సైతం తమకు వ్యతిరేకంగా ఉన్న రూల్స్ ను కొన్నింటిని మార్చాలని, అందులో కొన్ని మార్పులు చేయాలని సూచించాయి. రిటైన్ విధానం, RTM, వేలం డబ్బులను పెంచడం లాంటి మరికొన్ని విషయాల్లో నిబంధనలను మార్చాలని తెలిపాయి. దాంతో బీసీసీఐ మేనేజ్ మెంట్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆలోచించడం ప్రారంభించింది. మరి రాయల్ ఛాలెంజర్స్ కు ఆడాలనుందన్న రింకు సింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments